టీ 20 వరల్డ్ కప్ యుద్ధం ప్రారంభం కాబోతోంది. క్రికెట్ అభిమానులకు పండగే పండుగ. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం ఏడు వేదికలు ఏర్పాటుచేశారు. మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, అడిలైడ్, జీలాంగ్, పెర్త్, హోబార్త్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 16న ప్రారంభమయ్యే మొదటి రౌండ్‌లో తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా జట్లు ఆడుతాయి. ఈ మ్యాచ్ జీలాంగ్‌లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఉంటుంది.
ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం అయి అక్టోబర్ 21తో ముగుస్తాయి.
ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతాయంటే..
అక్టోబర్ 16: శ్రీలంక x నమీబియా – మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 16: క్వాలిఫయర్2 x క్వాలిఫయర్3 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 17: వెస్టిండీస్ x స్కాట్లాండ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 17: క్వాలిఫయర్ 1 x క్వాలిఫయర్ 4 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 18: నమీబియా x క్వాలిఫయర్ 3 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 18: శ్రీలంక x క్వాలిఫయర్2 రాత్రి గంటల నుంచి
అక్టోబర్ 19: స్కాట్లాండ్ x క్వాలిఫయర్4 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 19: వెస్టిండీస్ x క్వాలిఫయర్1 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 20: శ్రీలంక x క్వాలిఫయర్3 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 20: నమీబియా x క్వాలిఫయర్2 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 21: వెస్టిండీస్ x క్వాలిఫయర్4 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 21: స్కాట్లాండ్ x క్వాలిఫయర్1 రాత్రి 7 గంటల నుంచి