India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ మమూలుగా లేదుగా.. రూ.1 లక్ష దాటిన హోటల్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ ఖరారు చేసింది. అయితే అందరి కళ్లు మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి దాయాదుల మధ్య సమరం క్రికెట్ లవర్స్ కి కిక్ ఇవ్వబోతోంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈ క్రికెట్ వార్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్, భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తో సహా 5 మ్యాచులకు అహ్మదాబాద్ వేదిక కాబోతోంది.
ఇదిలా ఉంటే టోర్నీ ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. ఐనా కూడా అహ్మదాబాద్ నగరంలో చిన్న హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల దాకా రూమ్స్ బుక్ అవుతున్నాయి. హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా హోటల్ ధరలు రూ. 1 లక్షలను దాటాయి. హోటల్ గదుల రేట్లు దాదాపుగా 10 రెట్లు పెరిగాయి.
Also Read
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
Read Also: Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉండటంతో అభిమానులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వివిధ హోటల్ బుకింగ్ వెబ్సైట్లలోని రేట్లు పెరిగాయి. డిమాండ్ కారణంగా మరింతగా రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నగరంలోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి.
ఫైనల్‌తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలో తక్కువ వ్యవధిలో భారీ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం నగరంలో 10,000 గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్ష మంది కెపాసిటీ కలిగిన నరేంద్రమోడీ స్టేడియలో 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచనా. దీంతో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా నగరంలోని అన్ని లగ్జరీ హోటళ్లలో అక్టోబర్ 15 వరకు గదులు అందుబాటులో లేవు. గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ.. ఈ పెద్ద ఈవెంట్ కోసం లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బ్లాక్ చేశారు. దీంతో లగ్జరీ హోటళ్లలో ధరలు పెరిగాయని చెప్పారు.
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!