మరికాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈరోజు జరిగే పోరు ఇరుజట్లకు చావో రేవో లాంటిది. ఈ పోరులో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..?
Also Read: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు
ఈ జాబితాలో అగ్రస్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో ఉన్నాడు. అతడు అత్యధికంగా 24 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో కూడా కివీస్ ఆటగాడే ఉన్నాడు. టిమ్ సీఫర్ట్ 18 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 16 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగో స్థానంలో ఇద్దరు కివీస్ ఆటగాళ్లు ఉన్నారు. రాస్ టేలర్, విలియమ్సన్ ఇద్దరూ 14 సిక్సర్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించారు. 13 సిక్సర్లతో న్యూజిలాండ్ జట్టు విధ్వంసర ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఐదో స్థానంలో, 10 సిక్సర్లతో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో నిలిచారు.
Most sixes in #India vs #NewZealand T20Is:
— CricTracker (@Cricketracker) October 31, 2021
24 – Colin Munro
18 – Tim Seifert
16 – Rohit Sharma
14 – Ross Taylor
14 – Kane Williamson
13 – Martin Guptill
10 – KL Rahul#T20WorldCup