IND vs NZ Match: ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. విడతల వారీగా విక్రయాలు.. అజారుద్దీన్ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA President Azharuddin Gives Clarity On India vs New Zealand Match Tickets: ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజీల్యాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక అవుతుండటంతో, క్రీడాభిమానులు స్టేడియంలో ఈ మ్యాచ్ చూసేందుకు ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అజారుద్దీన్ తాజాగా టికెట్ల విషయంపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈసారి ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇవ్వడం లేదని, ఆన్‌లైన్‌లోనే అమ్ముతామని స్పష్టం చేశారు. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. విడతల వారీగా టికెట్ అమ్మకాలుంటాయన్నారు. జనవరి 13న 6 వేలు, జనవరి 14న 7 వేలు, జనవరి 15న 7 వేలు, జనవరి 16న మిగతా టికెట్లను అమ్మడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. మొత్తం స్టేడియం కెపాసిటీ 39,112 కాగా.. 29417 టికెట్లు అమ్మకానికి పెట్టామని, మిగిలిన 9695 టికెట్స్ కాంప్లిమెంటరీ టికెట్స్ అని చెప్పారు.
Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి
Also Read
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
అయితే.. మ్యాచ్‌కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు.. ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకునేవారు కేవలం 4 టికెట్స్ మాత్రమే తీసుకోవాలన్నారు. జనవరి 14న న్యూజీల్యాండ్ టీమ్ హైదరాబాద్‌కి వస్తుందని, 15న సాయంత్రం ప్రాక్టీస్ చేస్తుందని తెలిపారు. అనంతరం జనవరి 16న టీమిండియా హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 18వ తేదీన ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. మధ్యాహ్నం 1:30 నుంచి 5 గంటల వరకు తొలి ఇన్నింగ్స్.. సాయంత్రం 5:45 నుంచి 9:15 వరకు రెండో ఇన్నింగ్స్ ఉంటుందన్నారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్య.. ఆ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!