ఐపీఎల్ సీజన్ 2022లో జట్లు మధ్య పోటీ గట్టిగానే ఉంది. రోజురోజుకు మ్యాచ్‌లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్ స్టేడియ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంకుని బరిలోకి దిగగా ఆదిలోని షాక్ తగిలింది. సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (5 బంతుల్లో 7; ఫోర్) ఔటయ్యాడు. రెండో ఓవర్‌లోనే గిల్ వికెట్ పడటంతో గుజరాత్ టైటాన్స్ ఆచితూచి ఆడింది. అయితే సాహా రూపంలో రెండో వికెట్‌ను గుజరాత్ కోల్పోయింది. ఆ తరువాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డేవిడ్ మిల్లర్ ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా 18వ ఓవర్‌లో గుజరాత్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు 156/59 పరుగులు సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్..మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గుజరాత్ నిర్ధేశించిన 157 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను గెలిపించేందుకు రసెల్ (25 బంతుల్లో 48; ఫోర్, 5 సిక్సర్లు) విఫలయత్నం చేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రసెల్‌దే అత్యధిక స్కోర్ కాగా, రింకూ సింగ్ (35) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్లు పడగొట్టగా జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు హార్ధిక్ పాండ్యా (67) రాణించడంతో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.