Gujarat Titans Won The Match Against KKR: శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఛేధించింది. 17.5 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (49), విజయ్ శంకర్ (51 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (32) అద్భుతంగా రాణించడంతో.. గుజరాత్ గెలుపొందింది. చివర్లో విజయ్ శంకర్ అయితే ఊచకోత కోశాడు. తొలుత 16 బంతుల్లో 21 పరుగులే చేసిన విజయ్.. మరో 8 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అతడు ఎలా చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. విజయ్ శంకర్ ఇలా విజృంభించడం వల్లే.. ఇంకా 13 బంతులు మిగిలుండగానే మ్యాచ్ గుజరాత్ కైవసం అయ్యింది.
Drug-Resistant Bacteria: షాకింగ్ స్టడీ.. ప్రాణాంతక బ్యాక్టీరియాను మోసుకొస్తున్న మేఘాలు..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గుర్బాజ్ (39 బంతుల్లో 81) అర్థశతకంతో చెలరేగడం, చివర్లో ఆండ్రూ రసెల్ (19 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. కేకేఆర్ ఆ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. మొదట్లో కొంచెం నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాతి నుంచి ఒక్కసారిగా విజృంభించింది. ముఖ్యంగా.. శుబ్మన్ గిల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సాహా మాత్రం 10 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కాసేపు క్రీజులో కుదురుకున్నట్టు కుదురుకొని.. 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా అతని వెంటే పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్.. తమ విశ్వరూపం చూపించారు.
CM KCR : రేపే కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
తొలుత డేవిడ్ మిల్లర్ బౌండరీల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అతడు కాస్త నెమ్మదించగానే.. విజయ్ శంకర్ విధ్వంసం సృష్టించడం స్టార్ట్ చేశాడు. ఒక దశలో గుజరాత్ గెలుపొందడానికి.. 6 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సింది. అప్పటి నుంచి వీల్లిద్దరు ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా.. 13 బంతులు మిగిలి ఉండగానే వాళ్లు లక్ష్యాన్ని ఛేధించేశారు. అంటే.. 23 బంతుల్లోనే వాళ్లిద్దరు 69 పరుగులు కొట్టేశారు. దీన్ని బట్టి.. ఏ స్థాయిలో వాళ్లిద్దరు చెలరేగి ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో విజయ్ శంకర్ అర్థశతకం పూర్తి చేసుకోవడం మరో హైలైట్ విషయం. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్, రసెల్, సునీల్ తలా వికెట్ తీసుకున్నారు.