Gujarat Titans Gives Clarity On Kane Williamson: మార్చి 31వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే! బౌండరీ లైన్ వద్ద రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్స్‌ని క్యాచ్ పట్టబోయి.. కేన్ డైవ్ చేశాడు. ఈ క్రమంలోనే అతని మోకాలికి గాయమైంది. అతడు కనీసం కదిలే పరిస్థితిలో లేకపోవడంతో.. సిబ్బంది వచ్చి అతడ్ని తీసుకెళ్లింది. ఆ సమయంలోనే అతడు ఈ సీజన్‌కి దూరం అవ్వొచ్చన్న అనుమానాలు వచ్చాయి. అనంతరం వైద్యులు అతడ్ని పరీక్షించిన తర్వాత.. అతని మోకాలు ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. దాన్నుంచి కోలుకోవాలంటే చాలా సమయమే పడుతుందని కుండబద్దలు కొట్టాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్.. ఈ సీజన్‌లోని తదుపరి మ్యాచెస్‌లో కేన్ విలియమ్సన్ ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అతడు చెప్పిందే నిజమైంది. ఈ సీజన్ నుంచి కేన్ వైదొలుగుతున్నట్టు గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్రకటించింది.
Jayadev Unadkat: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన జయదేవ్.. తొలి భారత క్రికెటర్
‘‘ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి కేన్ విలియమ్సన్ దూరం అవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర గాయం కావడంతో, అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అతడు ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. కేన్ లాంటి కీలక ఆటగాడు దూరం కావడం.. గుజరాత్ టైటాన్స్‌కి పెద్ద దెబ్బే! కాగా.. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించిన కేన్.. సారథిగా, ప్లేయర్‌గా పెద్దగా సత్తా చాటలేకపోతున్నాడని అతడ్ని రిలీజ్ చేసింది. దీంతో.. మినీ వేలంలో కేన్‌ని గుజరాత్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. అతడు మిడిలార్డర్‌లో కీలక ఆటగాడిగా మారుతాడని గుజరాత్ యాజమాన్యం భావించింది. కానీ.. ఇంతలోనే అతడు గాయం కారణంగా వైదొలగడంతో, గుజరాత్‌కి ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.
PM Modi: ఈనెల 8న రాష్ట్రానికి ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన