IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది పలికారు. అయితే రెండు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా రూట్ (142 నాటౌట్), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారీ లక్ష్యంలా కనిపించిన టార్గెట్ కర్పూరంలా కరిగిపోయింది.
Read Also: Megastar Chiranjeeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే..?
Also Read
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్ల నుంచి టీమిండియా కెప్టెన్‌కు సహకారం లభించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులు చేయగా ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌటైంది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తడబాటుకు గురైంది. శుభ్‌మన్ గిల్ (4), హనుమా విహారి (11), విరాట్ కోహ్లీ (20) విఫలమయ్యారు. అయితే చతేశ్వర్ పుజారా (66), పంత్ (57) రాణించడంతో కోలుకున్నట్లు కనిపించిన భారత్ వాళ్లిద్దరూ అవుట్ కాగానే వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (19), జడేజా (23) శార్దూల్ ఠాకూర్ (4) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో 284 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 378 పరుగుల టార్గెట్ నిలిచింది. కాగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. దీంతో 2007 తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ గెలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు.
తాజావార్తలు
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!