England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
- ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రెండో టీ20
- తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
- అరంగేట్రం చేయనున్న యువ పేసర్ జోష్ టంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Playing XI vs India 2nd T20: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈరోజు జరగనున్న రెండో టీ20కి ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. ఇప్పుడు ఇరు జట్లు సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు కీలక మార్పులు చేసింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. అలాగే యువ పేసర్ జోష్ టంగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు.
జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రావడంతో సాకిబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్‌లపై వేటు పడింది. ఈ ఇద్దరి రాకతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం మరింత బలపడింది. ఆర్చర్ రాకతో భారత బ్యాటర్లు అలర్ట్ కావాల్సిందే. టీమిండియా బ్యాటర్లపై పూర్తి అవగాహన ఉన్న అతడు రెచ్చిపోవడం ఖాయం. అలానే ఆర్చర్ బౌన్సర్లకు ఇప్పటికే బ్యాటర్లు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బార్బొడాస్ పేసర్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడి.. మిగతా బౌలర్లను టార్గెట్ చేస్తే పరుగులు సాధించవచ్చు. ఈ మ్యాచులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని తెలుస్తోంది. మొదటి బంతి నుంచే విరుచుకుపడే బుడ్డోడు కూడా ఆర్చర్ బౌలింగ్‌లో ఎలా ఆడుతాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరిద్దరు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
తొలి టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్యవంశీకి మరోసారి అవకాశం దక్కకపోగా.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్లతోనే ఓపెనింగ్ కొనసాగించింది. అయితే ఆ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సంజు కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ దురదృష్టకరమైన రనౌట్‌తో ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ క్లిష్ట సమయంలో అభిషేక్ తన దూకుడు బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించిన అతడు 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తం 24 బంతుల్లో 59 పరుగులు బాదాడు. అభిషేక్ ఔటైన తర్వాత అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 67 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు అండగా నిలిచాడు. తిలక్ వర్మతో నాలుగో వికెట్‌కు 36 పరుగులు, శివమ్ దూబేతో ఐదో వికెట్‌కు 41 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
చివర్లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 21 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేసి.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కొనసాగడం సాధ్యపడలేదు. చివరకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా కొనసాగుతోంది. రెండో టీ20లో విజయం సాధించిన జట్టు సిరీస్‌లో కీలక ఆధిక్యం సాధించనుంది.
రెండో టీ20కి ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!