India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Cricket: క్రికెట్ అభిమానులకు శనివారం రోజు అసలైన పండగ లాంటి రోజనే చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు ఏకంగా మూడు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రం ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరు కాగా, మరొకటి వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్. ఇక మూడోది మాజీ దిగ్గజాలు తలపడే లెజెండ్స్ మ్యాచ్. ఆ మూడు మ్యాచ్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.
మొదటి మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా జరిగే ఈ పురుషుల టీ20 ఫైనల్ మ్యాచ్‌లో పసిడి పతకం కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టు ఈసారి గోల్డ్ మెడల్ కొట్టాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా? లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ఇక రెండో మ్యాచ్ భారత్, వెస్టిండీస్ మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మోహాలీ వేదికగా జరగనుంది. ఇది వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో దిగనున్నారు. ఈ సిరీస్‌ను ఇప్పటికే చేజిక్కించుకున్న టీమిండియా, ఆఖరి వన్డేలోనూ విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లోని తుది జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఈ రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు మాజీ క్రికెట్ దిగ్గజాల ఆటను చూసే అద్భుతమైన అవకాశం కూడా ఉంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నమెంట్ నేటి నుంచే అట్టహాసంగా ప్రారంభం కానుంది. సాయంత్రం 5:00 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాపియన్స్ జట్టు, ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ వంటి మన పాత తరం స్టార్ల ఆటను మరోసారి చూడొచ్చు.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!