ENG vs NZ: రెండో టెస్టులో సెంచరీలతో కదం తొక్కిన మిచెల్, బ్లండెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకి ఆలౌటైంది. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టెస్టులో గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఆ జట్టులో డార్లీ మిచెల్ (190: 318 బంతుల్లో 23×4, 4×6) భారీ శతకం నమోదు చేయగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో 14×4) సెంచరీ నమోదు చేశాడు.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్‌లో తొలిరోజు ఓపెనర్ విల్ యంగ్ (47), కెప్టెన్ టామ్ లాథమ్ (26) నిరాశపరచగా.. దేవాన్ కాన్వె (46), హెన్రీ నికోలస్ (30) కూడా తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో.. 169/4తో నిలిచిన న్యూజిలాండ్ టీమ్.. ఒత్తిడిలో కనిపించింది. కానీ.. ఐదో వికెట్‌కి టామ్, మిచెల్ జోడి ఏకంగా 236 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. న్యూజిలాండ్ టీమ్‌ని ఈరోజు తిరుగులేని స్థితిలో నిలిపింది.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
శతకం తర్వాత టామ్ బ్లండెల్ ఔటైపోయినా.. చివరి వరకూ డార్లీ మిచెల్ క్రీజులో నిలిచాడు. అతనికి బ్రేస్‌వెల్ (49) కాసేపు సపోర్ట్ అందించగా.. ఆఖర్లో జెమీషన్ (14), టిమ్ సౌథీ (4), మాన్ హెన్రీ (0) వరుసగా పెవిలియన్‌కి చేరిపోయారు. కానీ.. ట్రెంట్ బౌల్ట్ (16 నాటౌట్: 18 బంతుల్లో 4×4) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్, బెన్‌స్టోక్స్, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు, మాటీ పోట్స్ ఒక వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!