Navdeep Gives Clarity About Heroines Suicide News: 2005లో నవదీప్ కారణంగా ఓ హీరోయిన్ చనిపోయిందనే వార్త పెద్ద దుమారమే రేపింది. అప్పట్లో అదొక సంచలనం. ఒక ప్రముఖ పత్రిక కూడా ఆ వార్తని కవర్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వార్త ప్రస్తావన నవదీప్ ముందుకు వచ్చింది. తన న్యూసెన్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అతనికి ఆ ప్రశ్న ఎదురైంది. అందుకు అతడు ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఇన్ని సంవత్సరాల తర్వాత క్లారిటీ ఇచ్చాడు. అసలు అప్పట్లో జరిగింది వేరే విషయమని చెప్పాడు. అదొక ఫేక్ న్యూస్ అని ఖరాఖండీగా తేల్చి చెప్పాడు. అంతేకాదు.. గతంలో తాను ‘గే’ అని జరిగిన ప్రచారం కూడా అబద్ధమేనని నవదీప్ స్పష్టం చేశాడు.
Uber Drivers Protest : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్‌లు అందోళన
ఇక తన ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని వచ్చిన ప్రచారంలోనూ ఎలాంటి వాస్తవం లేదని నవదీప్ చెప్పుకొచ్చాడు. అందుకు తన తల్లే సాక్ష్యమని, ఎందుకంటే ఆ సమయంలో తాను తన అమ్మతో కలిసి ఫామ్ హౌస్‌లో డిన్నర్ చేశానని తెలిపాడు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ఎక్కువగా రావడం వల్ల.. తన ఇంట్లో వాళ్లే తనని అనుమానించే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మతో ఉన్నప్పుడే అలా ఏదో జరిగిపోయిందంటూ వార్త రాశారని అన్నాడు. అయితే.. అదంతా అబద్ధమని ఇంట్లో వాళ్లకు తెలుసు కాబట్టి. అప్పటి నుంచి తనపై తన ఇంట్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నాడు. అలాగే.. డ్రగ్స్ కేసు వ్యవహారంలోనూ తన పేరు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ హీరోయిన్ తన వల్ల చనిపోలేదని చెప్పిన నవదీప్, తనని లింక్ చేస్తూ ఆ వార్త ఎందుకు వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరిగింది.. ఆఫర్లొచ్చినా వదులుకున్నా
కాగా.. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో నవదీప్ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ వెంటనే గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, చందమామ నిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. ఆ తర్వాత హీరోగా పెద్దగా సక్సెస్‌లు చూడకపోవడంతో, అతడు సెకండ్ లీడ్‌గా, అలాగే నెగెటివ్ క్యారెక్టర్ ఉన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం న్యూసెన్స్ వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్ మే 12 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది.