Delhi Capitals Scored 144 Runs Against SRH: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (34), అక్షర్ పటేల్ (34) ఆదుకోవడం, మొదట్లో డేవిడ్ వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25) పర్వాలేదనిపించడంతో.. డీసీ ఈమాత్రం స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం దారుణం ప్రదర్శనతో నిరాశపరిచారు. సన్‌రైజర్స్ గెలవాలంటే.. 145 పరుగులు చేయాలి.
Best Airlines: ప్రపంచంలోని టాప్-10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకి మొదట్లోనే ఊహించని దెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ (0) డకౌట్ అయ్యాడు. అప్పుడు క్రీజులో వచ్చిన మిచెల్ మార్ష్.. వచ్చి రాగానే దూకుడుగా ఆడాడు. ఫోర్ల వర్షం కురిపించాడు. అతని బ్యాటింగ్ చూసి.. ఈసారి అతడు దున్నేయడం ఖాయమని భావించారు. కానీ.. 25 వ్యక్తిగత పరుగుల వద్ద అతడు ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత ఊపందుకున్న డేవిడ్ వార్నర్ సైతం.. రివర్స్ స్వీప్ షాట్ కొట్టి, క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కి చేరాడు. ఆ వెంటనే సర్ఫరాజ్ ఖాన్ (10), అమన్ ఖాన్ (4) పెవిలియన్ బాట పట్టాడు. ఇలా 8 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి డీసీ 62 పరుగులే చేసింది.
Kenya Cult Deaths: జీసస్‌ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన మనీశ్ పాండే, అక్షర్ పటేల్.. ఆచితూచి ఆడుతూ తమ జట్టుని ఆదుకున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ, సరైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీళ్లిద్దరు ఆరో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. వీళ్లు ఔటయ్యాక డీసీ పతనం మళ్లీ మొదలైంది. వచ్చిన బ్యాటర్లు క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, వెంటనే వెనుదిరిగారు. చివర్లో కుల్దీప్ యాదవ్ ఫోర్ కొట్టడంతో డీసీ 144 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ రెండు, టి.నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.