వార్నర్ ను కనీసం అందుకు కూడా పిలువలేదట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్‌రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్‌గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్‌ను నియమించారు. హైదరాబాద్ జట్టుకు తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ పట్ల మేనేజ్మెంట్ కఠినంగా వ్యవహరించింది. ముందుగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటివ్వలేదు. ఇక తాజాగా వార్నర్ తో ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. ఐపీఎల్ 2021 లీగ్ దశ ముగిసిన తర్వాత అభిమానుల కోసం వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో వార్నర్ కనిపించలేదు. దాంతో ఓ అభిమాని వార్నర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసి.. వీడ్కోలు వీడియోలో ఎందుకు లేరంటూ ప్రశ్నించాడు. అందుకు ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్ స్పందిస్తూ.. వీడియోలో మాట్లాడమని తనను ఎవరూ అడగలేదని పేర్కొన్నాడు. దాంతో జట్టు మేనేజ్మెంట్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
- Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
- Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?