ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్‌రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్‌గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్‌ను నియమించారు.…