Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై చివరి ఓవర్లో అద్భుత విజయాన్ని అందించిన తర్వాత భారత యువ ఆటగాడు మొహిత్ ఉల్వా తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఆఖరి ఓవర్లో తన మైండ్‌లో ఏం నడిచిందన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ, ఆ సమయంలో తన మనసులో పెద్దగా ఆలోచనలేమీ లేవని, కేవలం తనపై తనకు ఉన్న నమ్మకం, భగవంతుడిపై విశ్వాసంతోనే క్రీజులో నిలబడ్డానని తెలిపాడు.
ఈ ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్ కంటే ముందు వరకు తన ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదని మొహిత్ అంగీకరించాడు. తాను ప్రధానంగా బౌలర్‌నే అయినప్పటికీ, తనలో ఒక ఆల్-రౌండర్ ఉన్నాడని ఎప్పుడూ బలంగా నమ్మానని చెప్పాడు. అయితే ఆ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇప్పటివరకు తనకు సరైన అవకాశాలు రాలేదని, కానీ అవకాశం వస్తే కచ్చితంగా చేయగలననే ఆత్మవిశ్వాసం తనలో ఎప్పుడూ ఉండేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో తనకు మనల్ మద్దతు ఎంతో అవసరమైందని, తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు వెళ్లి అతడు సృష్టించిన మొమెంటం అద్భుతమని ప్రశంసించాడు. మనల్ సిద్ధం చేసిన ఆ వేదికపై తాను వెళ్లి పని పూర్తి చేయాల్సి వచ్చిందని వివరించాడు.
Also Read
- Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
- Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
- Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
చివిరి బంతికి కావాల్సిన 3 పరుగుల గురించి మాట్లాడుతూ.. తాను కేవలం ఆ ఒక్క బంతి కోసమే ఎదురుచూశానని మొహిత్ వెల్లడించాడు. బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించగలననే నమ్మకం తనకు పూర్తిగా ఉందని, భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని తెలిపాడు. ఈ రోజు తనదేనని, మ్యాచ్‌ను తానే ఫినిష్ చేస్తానని ముందే తెలుసని అన్నాడు. “నేను చేయగలను, నేను చేస్తాను, చివరి వరకు ఉండి పని పూర్తి చేస్తాను” అని ఎప్పుడూ తనకు తాను చెప్పుకుంటానని స్పష్టం చేశాడు.
ముఖ్యంగా చిగురుపాటి వెంకట తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడని మొహిత్ గుర్తు చేసుకున్నాడు. “నువ్వు చేయగలవు, వెళ్లి నీ సహజమైన ఆట ఆడు, నువ్వే మ్యాచ్‌ను ముగిస్తావు” అంటూ వెంకట తనను నిరంతరం ప్రోత్సహించాడని చెప్పాడు. చివరి బంతి వరకు క్రీజులో నిలబడితే తామిద్దరం కలిసి పని పూర్తి చేయగలమని వెంకట ఇచ్చిన నమ్మకం తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని, ఆఖరి బంతి వరకు క్రీజులో ఉంటే విజయం మనదేనన్న దృఢ సంకల్పంతో ఆడి జట్టును గెలిపించానని మొహిత్ ఉల్వా వివరించాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!