ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(88) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో బ్రావో రెండు, తీక్షణ ఒక వికెట్ సాధించాడు.
అయితే అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. చైన్నై 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన రాయుడు కీలక సమయంలో ఔటయ్యాడు. మరోసారి ఓటమిని తన ఖాతాలో వేసుకున్న చైన్న సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ తడబడింది.