ఐపీఎల్ 2021 ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు విధ్వంసకర వీరుడు గేల్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రపంచ కప్ కు వెస్టిండీస్ ప్రకటించిన జట్టులో గేల్ కూడా ఉన్నాడు. అయితే ఐపీఎల్ కంటే ముందు మరో రెండు లీగ్స్ లో పాల్గొన గేల్ అక్కడ బయో బాబుల్ లో ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా బయో బాబుల్ లోనే ఉండటంతో అతను కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రపంచ కప్ కంటే ముందు తాను కొంత రిలాక్స్ కావాలనుకుంటున్నాను అని చెప్పి ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే పంజాబ్ కూడా గేల్ నిర్ణయాన్ని గౌరవిస్తూ అతడిని వదిలి పెట్టింది.