ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 21న, సన్‌రైజర్స్ హైదరాబాద్ 31న అక్కడికి వెళ్తాయని తెలిసింది.కోల్‌కతా 27, పంజాబ్ కింగ్స్ 29, రాజస్థాన్ రాయల్స్ సెప్టెంబర్ 2న బయల్దేరతాయి. నియమావళి ప్రకారం ఆరు రోజులు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉంటాయి. బెంగళూరు మాత్రం ఈ నెల 31లోపే వెళ్తుందని తెలుస్తుంది.