పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల తమ జట్ల పాక్ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు – ECB. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్ కప్‌కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి ఉందంటూ తమ జట్ల పాక్ టూర్‌ను రద్దు చేసింది ECB. ప్రస్తుత పరిస్థితులో తాము పాకిస్థాన్ టూర్‌కు వెళ్లడం సరికాదని భావిస్తున్నామని తెలిపింది ECB.
ఇటీవలే పాక్ టూర్‌కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు… ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరిగింది. 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ టూర్‌కు వచ్చిన న్యూజీలాండ్… రావల్పిండిలో 3 వన్డేలు, లాహోర్‌లో 5 T-20లు ఆడాల్సి ఉంది. అయితే, వాటిని రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు కివీస్ ఆటగాళ్లు. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా తమ జట్టు రావడం లేదని పాకిస్థాన్‌కు తేల్చి చెప్పింది.
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
దీంతో వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన పలు టోర్నీలపైనా ఈ ప్రభావం కనిపించే సూచనలున్నాయి. 2022లో ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తోంది పాకిస్థాన్. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ల నిర్ణయం పాక్‌కు శరాఘాతమే. తమ దేశానికి వచ్చే క్రికెట్ జట్లకు సంపూర్ణ భద్రత కల్పిస్తోంది పాకిస్థాన్. కానీ… అక్కడి వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా పాక్ టూర్ అంటే భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇంగ్లాండ్ నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!