Mushfiqur Rahim: ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లపై పూర్తి దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ముష్ఫీకర్ రహీమ్ మొత్తం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఒక్క పరుగు మాత్రమే చేసిన అతడు కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌లోనూ నాలుగు పరుగులకే అవుటయ్యాడు.
Read Also: పడుకునే ముందు వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు
ఇప్పటివరకు ముష్ఫీకర్ రహీమ్ బంగ్లాదేశ్ తరఫున 102 టీ20 మ్యాచ్‌లను ఆడి 1500 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 72. బ్యాటింగ్ యావరేజ్ 19.23గా నమోదైంది. 126 ఫోర్లు, 37 సిక్సర్లను బాదాడు. 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ అవమానకర రీతిలో వెనుతిరగడంతో వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు భారం కాకూడదనే ముష్ఫీకర్ రహీమ్ పొట్టి క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.