బీట్రూట్: చాలా పోషకాలున్న వెజిటేబుల్ కానీ.. రాత్రిపూట తింటే, రక్తంలోని చక్కెర స్థాయిలో అమాంతం పెరుగుతాయి
మాంసాహారం: మటన్ లేదా చికెన్ ఫుడ్స్ తింటే.. అవి త్వరగా జీర్ణం కావు. ఫలితంగా పొట్టతో పాటు సంబంధిత సమస్యలు వస్తాయి
ఆరెంజ్ జ్యూస్: ఆరెంజ్ జ్యూస్లో కేలరీలు ఎక్కువ ఉంటాయి, ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది
టీ-కాఫీలు: వీటిల్లో కేలరీలు, కెఫీన్ అధికంగా ఉంటాయి. ఇవి తాగితే.. సరిగ్గా నిద్ర పట్టక పోగా, బరువు పెరిగే అవకాశముంది
మామిడి: ఇది జీర్ణవ్యవస్థను ఎక్కువసేపు పని చేయిస్తుంది, ఫలితంగా అది నిద్రపై ప్రభావం చూపుతుంది
క్యాబేజీ-కాలీఫ్లవర్: వీటిల్లో ఫైబర్ ఎక్కువ. ఇవి త్వరగా జీర్ణం కావు. జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోగా, బరువు పెరుగుతారు
ఆల్కహాల్: రాత్రి మద్యపానం సేవిస్తే, శరీరం బరువు అమాంతం పెరుగుతుంది. కాబట్టి, దీన్ని దూరం పెడితేనే బెటర్
కూల్ డ్రింక్స్: వీటిల్లో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువుని పెంచి, ఇతర సమస్యలకు దారితీస్తాయి