పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సిరీస్ భద్రత కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అపి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున ఈ సిరీస్ అకస్మాత్తుగా వాయిదా వేయడంపై తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ మా సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాలపై అలాగే వారి పై నాకు పూర్తి నమ్మకం ఉంది తెలిపాడు. అయితే పాకిస్థాన్ లో 2009 లో శ్రీలంక క్రికెటర్ల పైన దాడి జరిగిన సమయం నుండి అక్కడికి ఏ దేశ జట్టు వెళ్ళలేదు. పాక్ బోర్డు కూడా యూఏఈ వేదికగా తమ మ్యాచ్ లను నిర్వహించేది. కానీ ఈ మధ్యే మళ్ళీ పాకిస్థాన్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. శ్రీలంక, ఇంగ్లాండ్ వాంతి పెద్ద జట్లు పాక్ లో పర్యటించాయి. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ కూడా పాక్ పర్యటనకు రానుండగా మళ్ళీ సెక్యూరిటీ కారణంగా అది వాయిదా పడింది.