India vs Pakistan: తగ్గేదే లే.. భారత్ వెళ్లేది లేదు, పాక్‌ని రమ్మనేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur Gives Strong Counter To Pakistan Cricket Board: వచ్చే ఏడాది ఆసియా కప్ వన్డే టోర్నీని పాకిస్తాన్‌లో నిర్వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పాల్గొనదని జై షా చేసిన వ్యాఖ్యలు క్రీడా రంగంలో అగ్గి రాజేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ బోర్డు తీవ్రంగా స్పందిస్తూ.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌లో భారత్ అడుగుపెట్టకపోతే, ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను తాము కూడా బాయ్‌కాట్ చేస్తామని బెదిరింపులకు దిగింది. కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ లాంటి పాక్ మాజీ ఆటగాళ్లైతే మరింత రెచ్చిపోయారు. భారత్‌తో ఇకపై పాక్ ఆడదని అన్నారు. కమ్రాన్ అయితే.. అక్టోబర్ 23న జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచే పాక్ ఆడదని తెగేసి చెప్పాడు.
ఈ కామెంట్లకు గాను తాజాగా భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గట్టి కౌంటర్లు ఇచ్చారు. భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని తాము ఎవ్వరినీ బ్రతిమిలాడే ప్రసక్తే లేదని.. పాక్‌ని ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చారు. వచ్చే వారిని భారత్ స్వాగతిస్తుందని.. రావడం, రాకపోవడం ఆయా జట్ల ఇష్టమని చెప్పారు. అసలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. భారత్ ఓ క్రీడా శక్తి అని, ప్రపంచ క్రికెట్ చరిత్రలో బీసీసీఐకి అత్యున్నత హోదా ఉందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నోసార్లు భారత్ ఎన్నో ప్రపంచకప్‌లను సమర్ధవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పాక్ బెదిరింపులకు భారత్ తలొగ్గదని, ఒక్కసారి ఫిక్స్ అయితే మా మాటే మేమే వినము అన్నట్టుగా పాక్‌కి మొట్టికాయలు వేశారు.
Also Read
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!