Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బీజేపీలో చేరుతున్నారా? అనే ప్రశ్న ఊపందుకుంది. రాబోయే యూపీ ఎన్నికల్లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారా? లేదా భార్య దేవిశా శెట్టి పోటీ చేస్తారా? అనే అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో (Political Circles) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) సూర్యకుమార్ యాదవ్ కుటుంబం వరుసగా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.
భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ (Former T20 Captain), 2026 టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) విజేత సూర్యకుమార్ యాదవ్ ఇటీవల న్యూఢిల్లీలో తన భార్య దేవిశా శెట్టి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. ఆ వెంటనే అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలో దేశంలోని ఇద్దరు అత్యున్నత రాజకీయ నేతలతో జరిగిన ఈ వరుస సమావేశాల ఫోటోలను అటు సూర్యకుమార్‌తో పాటు ఇటు మోడీ, అమిత్ షా కూడా సోషల్ మీడియాలో (Social Media) షేర్ చేశారు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీ లైన్ వద్ద డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా పట్టి భారత్‌కు కప్పు అందించినట్టే, 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Uttar Pradesh Assembly Elections) చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి బీజేపీకి (BJP) భారీ విజయాన్ని అందిస్తారా అనే చర్చ మొదలైంది.
Also Read
- India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
- AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!
- Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
- AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
ఒకవేళ ఈ రాజకీయ విశ్లేషణలు నిజమైతే, సూర్య ఎంట్రీ అధికార బీజేపీకి పెద్ద ప్లస్ అవ్వడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీకి (Samajwadi Party) గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్యకుమార్ ముంబై రంజీ జట్టుకు ఆడినప్పటికీ, మూలాలు మాత్రం ఉత్తరప్రదేశ్‌లో బలంగా ఉన్నాయి. అయితే సూర్య స్వయంగా కాకుండా ఆయన భార్య దేవిశా శెట్టిని యూపీలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మోడీ, షాలతో జరిగిన భేటీ వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం (Political Strategy) ఇదేనని భావిస్తున్నారు.
ఈ ప్రచారానికి ప్రధాన కారణం యూపీలోని యాదవ ఓటు బ్యాంకు (Yadav Vote Bank). దాదాపు 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 10 నుంచి 11 శాతం వరకు యాదవ ఓటర్లు ఉన్నారు. సాంప్రదాయకంగా వీరంతా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఈ కంచుకోటలో చీలిక తేవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. యాదవ సామాజిక వర్గంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ (Fan Following) ఉన్న సూర్యకుమార్ గానీ, ఆయన భార్య గానీ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తే ఆ ఓటు బ్యాంకుపై నేరుగా ప్రభావం పడుతుందని, ఇది బీజేపీకి ఒక మాస్టర్ స్ట్రోక్ (Master Stroke) అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
క్రికెటర్ల భార్యలను ఎన్నికల బరిలోకి దించడం బీజేపీకి కొత్తేమీ కాదు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Elections) టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు జామ్‌నగర్ నార్త్ నుంచి టికెట్ ఇచ్చి బీజేపీ గెలిపించుకుంది. సంప్రదాయ చీరకట్టుతో, ప్రజల్లోకి వెళ్లి సూటిగా మాట్లాడే రివాబా ఇమేజ్ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు యూపీలో దేవిశా శెట్టి విషయంలోనూ అమలు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్వస్థలం యూపీలోని ఘాజీపూర్ జిల్లా (Ghazipur District), సైద్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హథౌడా గ్రామం. బార్క్ (BARC) ఇంజనీర్ అయిన ఆయన తండ్రి అశోక్ కుమార్ యాదవ్ ఇక్కడి వారే. ప్రస్తుతం సైద్పూర్ సీటు సమాజ్‌వాదీ పార్టీ (అంకిత్ భారతి) చేతిలో ఉంది. ఘాజీపూర్ జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల ఎస్పీ, 2 చోట్ల బీజేపీ మిత్రపక్షమైన ఓం ప్రకాష్ రాజ్‌భర్ పార్టీ (SBSP) గెలిచాయి. ఇక్కడ బీజేపీ నేరుగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టే సూర్య కుటుంబానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. మరి 2027 ఎన్నికల నాటికి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!
-
Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
-
Sam Pitroda Praises PM Modi: ప్రధాని మోడీపై సామ్ పిట్రోడా ప్రశంసలు.. ‘దయగల, కష్టపడే వ్యక్తి’ అంటూ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..