ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ అవకాశం నిన్నటితో 8 జట్లకు ముగిసింది. కొత్తగా వస్తున్న రెండు జట్లకు ఇంకా అవకాశం ఉంది. అయితే ఈ రిటైన్ లో దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్ లను తమతో ఉంచుకున్నాయి. ఒక్క పంజాబ్ కింగ్స్ జట్టు మినహా. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంతో ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఆ జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దాని పై పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఓ హింట్ ఇచ్చాడు. ఆ జట్టు 12 కోట్లతో రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్ వచ్చే ఐపీఎల్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరించే అవకాశం ఉంది అని తెలిపాడు. గత 3, 4 సంవత్సరాలుగా, అతను మా జట్టుతో ఉన్నాడు. అతను మా కోసం చాలా చేసాడు. నేను రెండు సంవత్సరాలుగా ఈ ఫ్రాంచైజీతో ఉంటున్నాను. అతను ఈ సమయంలో చాలా చాలా విజయవంతమయ్యాడు. అతను చాలా కాలంగా ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాబట్టి అతను జట్టును నడపగలడు అని కుంబ్లే తెలిపారు.