Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ కంపెనీ షేర్లు ఇటీవల ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ 4 శాతం మేర లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల విలువైన కొత్త తయారీ వర్క్ ఆర్డర్ లభించడమే ఈ భారీ రాలీకి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్ట్‌ను 13 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ముందే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కంపెనీకి రూ. 1000 కోట్లకు పైగా విలువైన గిగా ప్రాజెక్ట్ లభించింది. వరుసగా పెద్ద కాంట్రాక్టులు దక్కడంతో ఇన్వెస్టర్లలో ఆశావాదం పెరిగింది.
మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలో ఈ షేరు రూ. 292.70 వద్ద నమోదు కాగా.. రోజంతా సానుకూల ధోరణి కొనసాగి ఇంట్రా-డేలో రూ. 305.65 గరిష్ఠ స్థాయిని తాకింది. ఒకప్పుడు రూ. 2 కంటే తక్కువ ధరకు లభించిన ఈ పెన్నీ స్టాక్, దీర్ఘకాలంలో ఊహించని రీతిలో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. గత ఏడాది కాలంలో 40 శాతం, రెండేళ్లలో 11 శాతం మేర పతనమై తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, దీర్ఘకాలికంగా బలంగా నిలదొక్కుకుంది. ఐదేళ్ల కాలవ్యవధిలో ఏకంగా 1949 శాతం, పదేళ్లలో 1961 శాతం మేర అసాధారణ వృద్ధిని నమోదు చేసి మదుపరులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
డివిడెండ్లు , బోనస్ షేర్లతో కూడా కంపెనీ తన వాటాదారులకు అదనపు ప్రయోజనాలను అందించింది. 2025లో ఈ కంపెనీ 1:1 నిష్పత్తిలో అంటే ప్రతీ ఒక షేరుకు మరొక బోనస్ షేరును ఉచితంగా కేటాయించింది. అదే సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 0.20 డివిడెండ్ కూడా ఇచ్చింది. అంతకుముందు 2013లో 9:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చారు. 2017లో స్టాక్ స్ప్లిట్ ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక షేరును 10 చిన్న షేర్లుగా విభజించారు. దీంతో ముఖ విలువ రూ. 1కి తగ్గింది. కొత్తగా లభిస్తున్న భారీ ఆర్డర్లు , గతంలో చూపించిన రాబడుల వల్ల ఈ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!