Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
- అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ సూర్య కీలక వ్యాఖ్యలు
- అభిషేక్ ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలుసు
- ఎలాంటి ఆందోళన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అభిషేక్ సామర్థ్యంపై జట్టుకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమని, అలాంటి దశను ఇప్పుడు అభిషేక్ ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టిన అభిషేక్.. వరుసగా మూడు డకౌట్స్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య సమాధానం ఇచ్చాడు.
సూర్యకుమార్ కుమార్ మాట్లాడుతూ… ‘అభిషేక్ శర్మ ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. ప్రస్తుతం అతడు పరుగులు చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. త్వరలోనే అభిషేక్ మళ్లీ పరుగుల వరద పారిస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది. క్రికెట్లో ఫామ్ కోల్పోవడం సహజమే. జట్టులో ప్రతి ఒక్కరికీ అభిషేక్‌పై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్‌గా నాకైతే మరింత నమ్మకం ఉంది. త్వరలోనే అభిషేక్ తన సహజ ఆటతో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు’ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో అభిషేక్‌పై టీమ్ మేనేజ్మెంట్కు బలమైన మద్దతు ఉన్నట్టు స్పష్టమైంది.
Also Read
- Vaibhav Sooryavanshi: విరాట్ సలహాను పట్టించుకోని వైభవ్.. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా ఇంతే!
- Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
- Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులో అంత కోపం పనికి రాదమ్మా.. వైభవ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!!
ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ అన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2026లో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై డకౌట్ అయ్యాడు. దాంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా ఆశిష్ నెహ్రాతో కలిసి అభిషేక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఐదు డకౌట్లతో షాహిద్ అఫ్రిది, తిలకరత్న దిల్షాన్ మొదటి స్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?