Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Abhishek Sharma Creates History Fastest Indian To Hit 300 Sixes In T20 Cricket

Abhishek Sharma History: టీ20ల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర.. మరొకరికి సాధ్యం కాదేమో?!

Published Date :December 15, 2025 , 10:28 pm
By Sampath Kumar
  • టీ20ల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర
  • తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా అభిషేక్
  • విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై అభిషేక్ కన్ను
Abhishek Sharma History: టీ20ల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర.. మరొకరికి సాధ్యం కాదేమో?!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా నయా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 300 సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మూడు సిక్సర్లు కొట్టడంతో.. అభిషేక్ ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. 163 ఇన్నింగ్స్‌లలో ట్రిపుల్ సెంచరీ సిక్సర్ల రికార్డును అభిషేక్ చేరుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 205వ టీ20 ఇన్నింగ్స్‌లో 300వ సిక్సర్‌ను కొట్టాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ 251 మ్యాచ్‌లో 300వ సిక్సర్‌ను కొట్టి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.

అభిషేక్ శర్మ మరో రికార్డును కూడా తన పేరుపై లిఖించుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మూడుసార్లు సిక్స్ కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో అభిషేక్ మొదటి బంతికి సిక్స్ కొట్టాడు. లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ద్వారా తన ఖాతాతో ఈ రికార్డు చేరింది. టీ20లో అభిషేక్ బాదిన 300 సిక్సర్‌లలో ఈ ఏడాదిలోనే 107 సిక్సర్లు కొట్టాడు. టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 463 టీ20 మ్యాచ్‌లలో 547 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (414 మ్యాచ్‌ల్లో 435 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (345 మ్యాచ్‌ల్లో 395 సిక్సర్లు), సంజు శాంసన్ (319 మ్యాచ్‌ల్లో 368 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (405 మ్యాచ్‌ల్లో 350 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (239 మ్యాచ్‌ల్లో 332 సిక్సర్లు), సురేష్ రైనా (336 మ్యాచ్‌ల్లో 325 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (313 మ్యాచ్‌ల్లో 308 సిక్సర్లు) ఉన్నారు.

Also Read: సూపర్ లుక్, బెస్ట్ మైలేజ్, తక్కువ బడ్జెట్‌.. కొంటే TVS Apache RTR 160నే కొనాలి!

2025లో ఇప్పటివరకు అభిషేక్ శర్మ 40 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 1568 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 47 పరుగులు చేస్తే.. ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక భారత క్రికెటర్ అత్యధిక టీ20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడు. చూడాలి మరి అభిషేక్ ఈ రికార్డును సాధిస్తాడో లేదో చూడాలి. అభిషేక్ తన అరంగేట్రం నుంచే సంచలనాలు సృష్టిస్తున్నాడు. సునామి ఇన్నింగ్స్‌లతో రికార్డును బద్దలు కొడుతున్నాడు. సింగిల్స్, డబుల్స్ తీసినంత ఈజీగా.. అతని బ్యాట్ నుంచి సిక్సర్లు వస్తున్నాయి. అభిషేక్ ఆటపై అతడి గురువు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma
  • Abhishek Sharma 300 Sixes
  • Abhishek Sharma History
  • Abhishek Sharma Record
  • Abhishek Sharma T20 Records

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions