Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uma Kashvi: మహిళల అండర్-19 టీ20 ట్రోఫీ ఎలైట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో కర్ణాటక, విదర్భ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయాన, బౌండరీ లైన్ వద్ద ఉన్నట్టుండి ఓ కొండముచ్చు (లంగూర్) హల్చల్ చేసింది. అటుగా ఫీల్డింగ్ చేస్తున్న విదర్భ జట్టు ఆటగాడైన ఉమా కాశ్వి వైపు అది దూసుకొచ్చింది. తన వైపునకు కోపంగా వస్తున్న కొండముచ్చును చూసి ఒక్కసారిగా కంగారుపడిన ఉమ, పక్కకు తప్పుకోబోయి మైదానంలోనే కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ కొండముచ్చు ఆమెకు ఎలాంటి హాని చేయకుండానే వేగంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత తేరుకున్న ఉమ వెంటనే లేచి నిలబడటంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కర్ణాటక జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన విదర్భ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ, 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేవలం ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో కర్ణాటక జట్టు టోర్నమెంట్లో తదుపరి దశకు అర్హత సాధించినప్పటికీ, ఈ కోర్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మాత్రం మైదానంలో జరిగిన కోతి హడావుడి వలనే అందరికీ గుర్తుండిపోయింది.
Also Read
ఈ ఘటనతో వార్తల్లో నిలిచిన ఉమా కాశ్వి భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్లో పెద్ద స్టార్‌గా ఎదుగుతుందని అంతా భావిస్తున్నారు. ఒత్తిడిలోనూ కూల్ఫ్గా ఉండటం, అగ్రెసివ్ ఆల్-రౌండ్ స్కిల్స్ ఆమెను ప్రత్యేకంగా నిలబెడతాయి. డేంజరస్ ఆఫ్-స్పిన్ బౌలింగ్ తో పాటు కింది వరుసలో మెరుపు బ్యాటింగ్ చేయడంలో ఆమె దిట్ట. కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్లో తన ప్రయాణం మొదలుపెట్టిన ఉమ, కేవలం 12 ఏళ్ల వయసులోనే జూనియర్ క్లబ్ స్థాయి ఇంటర్-స్కూల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి కర్ణాటక అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తోంది.
గత జూన్, జూలై నెలల్లో శ్రీలంకలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత మహిళల అండర్-19 జట్టులోనూ ఆమె స్థానం దక్కించుకుంది. ఆ టూర్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి టీ20 సిరీస్‌ను 3-0తో, వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తన దూకుడుతో కూడిన ఆటతీరు, కీలక మ్యాచ్‌లలో రాణించే సత్తా ఉన్న ఉమా కాశ్వి నుంచి రాబోయే అండర్-19 వరల్డ్ కప్‌లోనూ టీమిండియా అద్భుతమైన ప్రదర్శన ఆశిస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్‌లో గెలుచుకున్న టైటిల్‌ను కాపాడుకునేందుకు బరిలోకి దిగుతున్న భారత జట్టులో ఉమా కాశ్వి ప్రదర్శన అత్యంత కీలకం కానుంది.
తాజావార్తలు
-
Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
-
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
-
CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
-
Victory Venkatesh: క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!