ఈనెల 10న టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో అడిలైడ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ మూడుసార్లు తలపడ్డాయి

భారత్ రెండు సార్లు విజయం సాధించగా ఇంగ్లండ్ ఒక్కసారి గెలిచింది

2007 టీ20 ప్రపంచకప్‌లో 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది

2009 టీ20 ప్రపంచకప్‌లో మూడు పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ గెలిచింది.

2012 టీ20 ప్రపంచకప్‌లో 90 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ నాకౌట్ దశలో తలపడలేదు

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఇరుజట్లు 22 మ్యాచ్‌లు ఆడగా భారత్ 12, ఇంగ్లండ్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి