Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why RR Rejected MI Trade Demand: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారిన హార్దిక్ కోసం అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అయితే ముంబై ఇండియన్స్ పెట్టిన డిమాండ్లకు రాజస్థాన్ అంగీకరించకపోవడంతో ఈ డీల్ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.
2027 ఐపీఎల్ రిటెన్షన్ గడువుకు ముందు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ఫ్రాంచైజీల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు పంజాబ్ కింగ్స్ అతడిని సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లాడు. అయితే హార్దిక్ కోసం రాజస్థాన్ చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైందనే డీటెయిల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. పాండ్యాను ఇచ్చేందుకు రాజస్థాన్ ముందు ముంబై భారీ ప్రతిపాదన ఉంచిందట. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా ట్రేడ్‌లో భాగంగా ఇవ్వాలని ముంబై కోరినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి రాజస్థాన్ యాజమాన్యం ఇష్టపడలేదు. దీంతో ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లలేదట.
Also Read
- India Playing 11: కొత్త ఆటగాడికి ఛాన్స్?.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
- Tom Latham: ఆమ్మో జస్ప్రీత్ బుమ్రా.. రెండు సార్లు డకౌట్.. రెండో టెస్టుకు మాస్టర్ ప్లాన్ వేశా!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
హార్దిక్ పాండ్యాను దక్కించుకోలేకపోయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ మరో కీలక ట్రేడ్ డీల్‌ను పూర్తి చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు పంపించి.. ప్రతిగా భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, స్పిన్నర్ మనీమారన్ సిద్ధార్థ్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ఒప్పందంలో షమీని లక్నో గతంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. రాజస్థాన్‌కు మారే సమయంలో అతడి ధరను రూ.8 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ తన ప్రస్తుత ధర రూ.75 లక్షలకే రాజస్థాన్‌కు మారనున్నాడు. మరోవైపు సామ్ కరన్ రూ.2.4 కోట్ల ప్రస్తుత ధరతో లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడు.
మహమ్మద్ షమీ రాకతో రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ వంటి ప్రపంచస్థాయి బౌలర్ జట్టులో ఉండటంతో.. కొత్త బంతితో వీరిద్దరూ ప్రత్యర్థి బ్యాటర్లకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. 2024 సీజన్లో రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు. మరోవైపు షమీకి ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం, అంతర్జాతీయ అనుభవం రాజస్థాన్‌కు ఉపయోగపడనున్నాయి. ఇప్పుడు షమీ, ఆర్చర్ జోడీ ఎలా రాణిస్తుందన్నది ఐపీఎల్ 2027లో ఆసక్తికరంగా మారనుంది.
తాజావార్తలు
-
Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
-
Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
-
India Playing 11: కొత్త ఆటగాడికి ఛాన్స్?.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో సిరా వివాదం.. బ్యాలెట్ బాక్సుల వద్ద కలకలం
-
YSRCP Leader Arrest : వైసీపీ నేత అరెస్ట్.. పోలీసు వాహనంపైకెక్కి మహిళ నిరసన
ట్రెండింగ్
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!