పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు. ఈ లోగా ప్రజా న్యాయస్థానంలో విజయాలు సాధించినా లేక ఓడిపోయినా దాన్నిబట్టి కూడా నిర్ణయం కాదు. సాక్ష్యాధారాలు దర్యాప్తు కోర్టు అంతిమంగా నిర్ధారించవసిందే.ఈ ప్రాథమిక సత్యం మన రాజకీయ నేతకు తెలుసు. అయినా సరే తాము ఏమి చేస్తే ప్రచారం లభిస్తుందో తెలుసు గనక తాము ఏమి చేసినా ప్రచారం తెచ్చుకోవచ్చనే భరోసాతో ప్రహసనాలు నడుపుతూనే వుంటారు. తెంగాణలోనూ ఎపిలోనూ నడుస్తున్నది ఇలాటి ప్రమాణాల ప్రహసనమే.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతిలోని అలిపిరి వద్ద ఈ అలవాటైన ఈ ప్రక్రియకు మరింత ముందుకు తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించేముందు తెంగాణలో బిజెపి అద్యక్షుడు బండిసంజయ్ రాజకీయ క్రీడను గుర్తు చేసుకోవాలి.
జిహెచ్‌ఎంసి ఎన్నిక తరుణంలో రాజకీయంగా వచ్చిన విమర్శకు భాగ్యక్ష్మి ఆలయం ముందు ప్రమాణం చేద్దామని బండి సంజయ్ ప్రతిపాదించారు. కార్పోరేషన్ ఎన్నిక సందర్భంగా వరద సహాయం పంపిణీ ఆపేయాలని తనపేరుతో ఎన్నిక కమిషనర్‌కు అందిన లేఖ తాను రాయలేదన్నది ఆయన వాదన. ఈ మేరకు భాగ్యక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయనసవాల. దీనికి ఎవరూ స్పందించకపోయినా తనకు తానే అక్కడ తయారై ప్రమాణం చేశాననిపించారు. మీడియా ప్రసారానికి తప్ప అదెందుకూ అక్కరకు రాలేదు. ఆ తర్వాత విశాఖ పట్టణంలోనూ, ఇతర చోట్ల కూడా టిడిపి వైసీపీ నాయకులు ఇలాగే ప్రమాణాలు సవాళ్లు విసురుకున్నారు. వాటిపై కొన్ని ఛానళ్లలో కథనాలు ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇటీవ బిజెపి తృణమూల్ నాయకులు ఎవరికి వారు సవాళ్లువిసురుకున్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసుపై తాజాగా నారాలోకేశ్ నడిపిన తతంగంవీటన్నిటిని మించిపోయింది. ఇవన్నీ వాస్తవంగా 2019ఎన్నిక ప్రచారంలోవిన్నవే. ఎందుకంటే ఆ ఎన్నికల మధ్యలోనే హత్య జరిగింది, తిరుపతి ఉప ఎన్నికలో ఆ హత్య ప్రధానాంశమేమీ కాదు. వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో తన సందేహాలు వెలిబుచ్చిన కారణంగా మీడియాలో ప్రాధాన్యత వచ్చింది. ఆమె ఏ సిబిఐ అధికారులను కలిసి దర్యాప్తు వేగవంతం చేయాలని కోరిందో వారినుంచి ఎలాంటి స్పందన లేదు. కాకుంటే ఈ మధ్య పులివెందుల వెళ్లి మళ్లీ కొంత దర్యాప్తు చేశామనిపించారు. పైన సిబిఐ జిల్లాలో రాష్ట్రంలో పోలీసు మౌనం కొనసాగిస్తుండగా టిడిపి వైసీపీ నేతలు మంత్రులతో సహా పరస్పర ఆరోపణలు పెంచారు.వాస్తవంగా ఈ రెండు పార్టీలు అధికారంలో వున్నవే గనక ఆధారాలు సేకరించడానికి వుంటే బయిటపెట్టడానిక,సాక్ష్యాధారాలతో అవతలివారిని ఖండించడానికి బోలెడు అవకాశం వుంది. ఆధారాలేమీ లేకుండా ఒకరిని ఒకరు అనుకోవడం అంటే ఎవరో ఒకరు ప్రజలను పక్కదోవ పట్టించడమే అనుకోవాలి.బయిట ఏమి మాట్లాడినా అంతిమంగా సిబిఐ హైకోర్టు కూడా ఈ దర్యాప్తులో నిమగ్నమై వున్నాయి. ఆలస్యమైందని డా.సునీత ఆవేదన చెందినా నిరాధారంగా హడావుడి పడే అవసరం వాటికి వుండదు. రాజకీయ నిందారోపణలను బట్టి కూడా నడవదు. ఈ పూర్వరంగంలో లోకేశ్ తమ పార్టీకి సంబందం లేదని ప్రమాణం చేయడం అవతలివారిని కూడా చేయమని సవాలు చేయడం హాస్యాస్పదం. వైసీపీ టిడిపి నేతలు ఉభయులూ ప్రమాణం చేసినంత మాత్రాన ఎవరినీ నమ్మాల్సిన అవసరం ప్రజలకు లేదు. వుండదు. న్యాయస్థానాల్లో కూడా దేవుడి మీద ప్రమాణం చేయడం ప్రారంభం మాత్రమే. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ వుంటుంది. దర్యాప్తు కొనసాగుతూనే వుంటుంది. కనుక ఇలాంటి లేనిపోని ప్రహసనాల వల్ల ప్రజలకు చీమతకాయంత ప్రయోజనం వుండదు.వారు పెద్దగా పట్టించుకోరు కూడా. దానిపై మళ్లీ మంత్రి కన్నబాబు రంగంలోకి దిగి టిడిపిపై తమ రాజకీయ ఆరోపణలన్నీ ఏకరువు పెట్టి ప్రమాణాలు చేయడం మరో విడ్డూరం. తమ విమర్శలను వారు తోసిపుచ్చుతూనే వున్నారు. ఇప్పుడూ అంగీకరించే ప్రసక్తి వుండదు. ఏతావాతా ఏపిని గతంలో పాలించిన వారు ఇప్పుడు పాలిస్తున్న వారు కూడా అసలు సమస్యపై చర్చ లేకుండా చేయడానికి ఈ తరహా తతంగాలు సాగిస్తున్నారనేది వాస్తవం. వన్‌సైడ్ ప్రేమన్నట్టే వన్‌సైడ్ ప్రమాణాలు దండగ. రెండు సైడ్లవారు చేసినా కూడా వాటికి ప్రామాణికత వుండదు. చట్ట ప్రమాణంవేరు మత ప్రమాణం వేరు. ప్రమాణం అంటే కొలబద్ద నమ్మకంకాదు.