ఇప్పుడు అంతా రసాయనాలతో నిండిపోయింది.. ఏది చూసిన కెమికల్స్ వేస్తున్నారు.. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు కూడా కెమికల్స్ తో నిండిపోయాయి. అందుకే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాగా కడిగి వాడాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా కూడా అది అందరికీ అందడం లేదని చెప్పాలి..పంట బాగా దిగిబడి రావాలని అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడుతూ కలుషితం చేస్తుంటే..
మరోవైపు వ్యాపారులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని రసాయనిక మందులను వాడి స్టోర్ చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు నోటికో, కోటికో ఒకరు ఉంటారు.అలాంటి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు ఢిల్లీలోని సోదరులు.. వారిద్దరి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
మృణాల్, లక్షయ్ వాళ్ల అమ్మమ్మ క్యాన్సర్ తో బాధపడ్డారని ఎవరు అలా చనిపోకూడదని సేంద్రియ వ్యవసాయంతో కూరగాయలను పండిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. కూరగాయలు, గోధుమలు, కందులు, ఆవాలు, వరి, మినుములు మరియు పండ్ల పంటల ఉత్పత్తిని పెంచారు ఇద్దరు అన్నదమ్ములు. ఆర్గానిక్ ఎకర్ బ్రాండ్ క్రింద ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 5,000 కుటుంబాలకు నాణ్యమైన కూరగాయలను అందిస్తున్నారు..
చుట్టు పక్కల గ్రామాల్లో రైతులకు సేంద్రీయ పద్ధతుల్లో పంటలు ఎలా పండించాలి అనే వాటి మీద వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తున్నారు..ప్రతి ఏడాదికి రూ.3.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది.సంవత్సరం మొత్తం పంట చేతికందేలా చూసుకున్నారు. కాలానికి అనుగుణమైన పంటల సాగు చేస్తున్నారు..దాంతో నెల మొత్తం 4 లక్షల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు.. కూరగాయలు మాత్రమే నెయ్యి, తేనె, వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు.. ఎంతో మంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూరగాయలను కొంటున్నారని చెబుతున్నారు..వావ్..సూపర్ కదా..