Yamudu Review: యముడు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: జగదీశ్ ఆమంచి, శ్రావణి శెట్టి, అద్విక శర్మ, ఆకాశ్ చల్లా తదితరులు
- DIRECTOR: జగదీశ్ ఆమంచి
- MUSIC: భవాని రాకేష్
- PRODUCER: జగదీశ్ ఆమంచి
తెలుగు తెరపై క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఆ క్రైమ్ కాన్సెప్ట్‌కు మైథాలజీ అంశాలను జోడిస్తే ప్రేక్షకులకు కలిగే కిక్కే వేరు. సరిగ్గా ఇదే ప్రయత్నంతో డెబ్యూ నటుడు జగదీశ్ ఆమంచి దర్శకుడిగా, నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం “యముడు”. గరుడ పురాణం నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
విశ్వ (జగదీశ్ ఆమంచి) ఒక అనాథ. ఓ వృద్ధాశ్రమం నడుపుతూ అను (శ్రావణి శెట్టి) అనే అమ్మాయిని ప్రేమించి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. మరోవైపు జగడ్ అనే యువ సంగీత దర్శకుడు, అతని మిత్రుడు ఆకాష్, హరిణి (అద్విక శర్మ)ల కథ నడుస్తుంటుంది. హరిణిని జగడ్ ప్రేమిస్తున్నప్పటికీ, ఆమె ఆకాష్‌తో రిలేషన్ లోకి వెళ్తుంది. అయితే జగడ్కి ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు వస్తుందని తెలిసాక, తన స్వార్థం కోసం ఆకాష్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక అదే సమయంలో ఆ ఊరిలో మహిళలే లక్ష్యంగా వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? కేవలం మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ హత్యల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? విశ్వ, జగడ్ కథలు ఎక్కడ కలిసాయి అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
సాధారణంగా సీరియల్ కిల్లర్ కథల్లో ఒకే తరహా హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కిల్లర్ చేసే హత్యలకు గరుడ పురాణంలో చెప్పిన శిక్షలకు (పాపాలకు పడే శిక్షలు) ముడిపెట్టడం ఆసక్తికరం. క్రైమ్‌కు పురాణ కథలను, యముడి కాన్సెప్ట్‌ను జోడించడం వల్ల ప్రతి హత్య వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మైథాలజికల్ యాంగిల్ వల్ల సాధారణ సీరియల్ కిల్లర్ టెంప్లేట్ పక్కకెళ్లి కొంచెం కొట్టగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కేవలం సీరియస్ మైండ్ గేమ్‌కే పరిమితం కాకుండా, వినోదానికి కూడా ప్రాధాన్యం ఇచ్చింది. అయితే కధలోకి వెళ్ళే వరకు కొంచెం లాగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఓ వైపు వరుస హత్యలతో నగరంలో భయాందోళనలు జరుగుతున్న వాతావరణాన్ని చూపిస్తూనే, మరోవైపు ప్రధాన పాత్రలైన విశ్వ-అనుల లవ్ స్టోరీని నడిపించిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ వేగం పుంజుకుంటుంది వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ, కిల్లర్ అసలు మైండ్ సెట్ ఏంటి? హత్యలకు గురవుతున్న మహిళలకు, హంతకుడికి ఉన్న సంబంధం ఏంటి? అనే సీక్రెట్స్‌ను రివీల్ చేసే విధానం బాగుంది. క్లైమాక్స్ కేవలం థ్రిల్లింగ్ రివీల్‌తో ముగిసిపోకుండా, సమాజంలో మహిళలు ఎదుర్కొంటుంది ఏంటి, వారికి ఎలాంటి మెసేజ్ అవసరమనేది ఎమోషనల్‌గా చెప్పడం కొంత బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే ఒకేసారి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా త్రిపాత్రాభినయం చేసిన జగదీశ్ ఆమంచి తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ మినహా మిగిలిన భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించాడు. శ్రావణి శెట్టి తన పాత్రకు న్యాయం చేయగా, అద్విక శర్మ గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ఆకాశ్ చల్లా ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. భవాని రాకేష్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ దృశ్యాలను గ్రాండ్‌గా చూపించడంలో సక్సెస్ అయింది. శివ కుంద్రపు స్క్రీన్ ప్లేకి తోడు, యముడి కాన్సెప్ట్ ఆధారంగా రాసిన సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
చివరిగా గరుడ పురాణం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ‘యముడు’.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చొచ్చు.
Also Read
తాజావార్తలు
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!