Sarkaru Vaari Paata Review: “సర్కారు వారి పాట”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Mahesh Babu, Keerthy Suresh
- DIRECTOR: Parusuram Petla
- MUSIC: SS. Thaman
- PRODUCER: Gopichand Achanta, Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta
మహేశ్ బాబు వంటి సూపర్ స్టార్ సినిమా జనం ముందుకు రాక రెండు సంవత్సరాలు దాటిపోయింది. 2020లో సంక్రాంతి కానుకగా వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` తరువాత వస్తున్న చిత్రం కాబట్టి మొదటి నుంచీ `సర్కారువారి పాట` సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మెండుగానే ఉంది. ఇక ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ కూడా ఇంతకు ముందు తాను తెరకెక్కించిన `గీత గోవిందం`తో జనాన్నిఅలరించారు. చిత్ర కథానాయిక కీర్తి సురేశ్ `మహానటి`తో జనం మదిని దోచింది. ఇక నిర్మాతల విషయానికి వస్తే 14 రీల్స్ మహేశ్ తో తీసిన తొలి చిత్రం `దూకుడు`, మైత్రీ మూవీ మేకర్స్ ఆయనతో తెరెకెక్కించిన సినిమా `శ్రీమంతుడు` బాక్సాఫీస్ ను షేక్ చేసేశాయి. ఇప్పుడు మహేశ్ బాబుతో కలసి మైత్రీ మూవీస్, 14 రీల్స్ `సర్కారు వారి పాట`ను నిర్మించడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇన్ని విధాలుగా అందరిలోనూ క్యూరియాసిటీ పెంచిన `సర్కారువారి పాట` మే 12న జనం ముందు నిలచింది.
`సర్కారు వారి పాట` టైటిల్ ను బట్టే ఇదేదో వేలం వేసే కథ చుట్టూ తిరిగేలా ఉందే అనిపిస్తుంది. సామాన్యునికి అప్పు ఇవ్వడానికి పలు సాక్ష్యాలు కోరే బ్యాంక్ వారు, ఒకవేళ ఆ సామాన్యుడు సకాలంలో అప్పు తీర్చలేకపోతే నానా యాగీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు వారి తాకిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నవారూ లేకపోలేదు. అయితే కోటీశ్వరులకు బ్యాంకు వారే అన్నీ పూర్తి చేసి మరీ అడిగినంత రుణం మంజూరుచేస్తారు. సదరు ఆసామి, కట్టకపోయినా, ఎంతో తగ్గింపు కూడా ఇస్తారు. లేదా ప్రభుత్వాలే అలాంటి వారికి కొమ్ముకాసి మరీ దేశం సరిహద్దులుదాటిస్తాయి. ఇలాంటి సంఘటనలు మనదేశంలో కొత్తేమీ కాదు. `సర్కారు వారి పాట`లోని కథ కూడా ఈ రుణాల గొడవ చుట్టూ తిరుగుతుంది. ఓ మధ్య తరగతి వ్యక్తి బ్యాంకులో అప్పు చేసి, దానిని తీర్చలేని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటాడు. అనాథ అయిన అతని కొడుకు ఓ శరణాలయంలో పెరిగి పెద్దయి, తెలివితేటలతో అమెరికాలో కోట్లు సంపాదిస్తాడు. ఇతరులకు అప్పులు ఇవ్వడం, రాబట్టుకోవడం అతని పని. అతడే మహేశ్. అమెరికాలో ఉన్న మహేశ్ ను కళావతి ఆకర్షిస్తుంది. ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్ లో ఓ ఎమ్.పి. తండ్రి దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం ఉండదు కానీ, జల్సాలు చేస్తూ ఉంటుంది. ఆమె మోసంతో మహేశ్ ఆర్థిక సాయం పొంది అతనికి టోకరా స్తుంది. దాంతో తన సొమ్ము వసూలు కోసం ఇండియా వచ్చిన హీరోకు ఆమె తండ్రి కూడా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని, ఎగ్గొట్టినవాడే అని తెలుస్తుంది. హీరో ఇండియా వచ్చేటపుడు ముందూ చూసుకోకుండా కోటీశ్వరులకు అప్పు ఇచ్చిందనే నేరంపై ఎయిర్ పోర్ట్ లో ఓ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ చేస్తారు. ఆ బ్యాంకులో అధికమొత్తంలో అప్పు చేసిన ఘనుడు కళావతి తండ్రి. పదివేల కోట్లు సదరు ఎమ్.పి. బ్యాంకుల నుండి దోచాడని తెలుసుకుని తనకు ఆ ఎమ్.పి. పదివేల కోట్లు బాకీ పడ్డాడని, అతని కూతురును ప్రేమించడం వల్ల అమెరికాలో పదివేల కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయిని వదలుకొని వచ్చానని ప్రచారం చేస్తాడు. మీడియాలోనూ ఇది విశేషంగా ప్రసారమవుతుంది. మహేశ్ ను ఎం.పి లేపేసే ప్రయత్నం చేస్తాడు. హీరో దానిని ఎదుర్కొంటాడు. తనను కలవాలనుకున్న ఎంపికి ఢిల్లీలో జైలుకు రమ్మని చెబుతాడు మహేశ్. అక్కడ అరెస్ట్ అయిన లేడీ బ్యాంక్ మేనేజర్ ముందు ఎమ్.పి.ని కలిసి తను తీసుకున్న అప్పు కక్కిస్తానంటాడు. దేశంలో ఎందరో ఘరానా బాబులు బ్యాంకుల రుణాలు తీర్చడం లేదని, అదే మధ్య తరగతి వారినైతే బ్యాంకులు మరీ వేధిస్తాయనీ మహేశ్ జనానికి బోధపడేలా చేస్తాడు. హీరోయిన్ సైతం పరివర్తన చెంది, హీరోకు సహకరిస్తుంది. ఆ తరువాత జనానికి బ్యాంకుల్లో ఉన్నది ప్రజల సొమ్ము! మీ సొమ్మును మీరే కాపాడు కోవాలి అంటూ హీరో చాటడమే ఇందులోని అసలు కథ.
Also Read
మహేశ్ బాబు అభిమానులతో పాటు, అందరినీ ఆకట్టుకొనేలా అభినయించారు. అసలే మహేశ్ సినిమా కోసం కాచుకొని ఉన్నారేమో, ఆయన ఇంట్రడక్షన్ సీన్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. కీర్తి సురేశ్ `మహానటి`లో పాత్రకు తగ్గట్టుగా ముద్దుగా బొద్దుగా కనిపించింది. ఇందులో ఆమె కొద్దిగా గ్లామరస్ గా కనిపించినా ఆమె పోషించిన కళావతి పాత్ర కీర్తి అభినయానికి తగనిది అనే చెప్పాలి. తనకు ఏ రోల్ లభించినా, అందులో పరకాయ ప్రవేశం చేయాలనే తపిస్తారు సముతిర ఖని, ఇందులోనూ ఆయన అదే తీరున సాగారు. వెన్నెల కిశోర్ పాత్ర కాసింత రిలీఫ్ ఇస్తుంది. ప్రథమార్ధంలో కామెడీతో కాసింత నవ్వించినా… ద్వితీయార్ధం ప్రేక్షకుని సహనాన్ని పరీక్షిస్తూ నత్త నడకలా సాగింది. థమన్ స్వరకల్పనలో “కమాన్ కమాన్ కళావతి…“, “మామ మహేశా…“ పాటలు ఫ్యాన్స్ ను కిర్రెక్కిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక మది సినిమాటోగ్రఫి కథకు అనువుగా సాగింది. ఇప్పటి దాకా టాప్ స్టార్స్ తో సినిమా తెరకెక్కించని దర్శకుడు పరశురామ్ కు ఇది ఓ పరీక్ష అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలను భలేగా తెరకెక్కించారు. మరికొన్ని చోట్ల పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. వినోదం బాగా పండించగలిగిన పరశురామ్ ఇందులోనూ అదే పంథాలో సాగారు. అయితే ద్వితీయార్ధంలో యాక్షన్ ఎపిసోడ్స్ ను సరిగా హ్యాండిల్ చేయలేక పోయారనే చెప్పాలి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడని వైనం కనిపించింది. ఫైట్స్ సైతం నేల విడిచి సాము చేసినట్లు కనిపిస్తుంది. మహేశ్ బాబుతో తొలిసారి పనిచేసిన దర్శకులలో చాలామంది మంచి విజయాలను సాధించారు. మహేశ్ తో పరశురామ్ కలసి పనిచేయడం ఇదే మొదటిసారి. అయితే పరశురామ్ ఆశించిన ఫలితాన్ని ప్రేక్షకులు అందించకపోవచ్చు.
ప్లస్ పాయింట్స్:
– మహేశ్ సినిమా చాలారోజులకు రావడం
– మహేశ్, పరశురామ్ తొలి చిత్రం కావడం
– ఆకట్టుకున్న థమన్ బాణీలు
మైనస్ పాయింట్స్:
– ద్వితీయార్ధంలో పట్టు లేకపోవడం
– సన్నివేశాలు సాగదీసినట్టు ఉండడం
– ఆకట్టుకోని యాక్షన్ ఎపిసోడ్స్
– ఏ పాత్రకూ న్యాయం జరగక పోవడం
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: రికవరీ కాని ‘సర్కారువారి పాట’.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!