Peddi Movie Review: ‘పెద్ది’ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3.25 / 5
- MAIN CAST: Ram Charan, Janvi Kapoor, Divyendu Sharma, Jagapathi Babu, Shiva Raj Kumar and others
- DIRECTOR: Buchibabu
- MUSIC: Ar Rahman
- PRODUCER: Venkata Satish Kilaru
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా రూపొందుతోంది అని ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్‌కుమార్ సహా చాలామంది నటీనటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇదంతా సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాని ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ మూడవ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
పెద్ది కథ:
పెద్ది (రామ్ చరణ్) విజయనగరం పట్టణానికి దగ్గరలో ఉన్న ఓ కొండ కింద పల్లెలో నివసిస్తూ ఉండే ఆదివాసి. అతని గ్రామానికి గుర్తింపు ఉండదు. ఇక ఆ గ్రామంలో ఉండే వారికి ఎలా గుర్తింపు ఉంటుంది? అయినా సరే, తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని, తన ఊరి మీదుగా వెళ్లే రైలుకి ఒక స్టేషన్ ఏర్పాటు చేసి తన గ్రామంలో ఆగేలా చేయాలని అదే గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు.
Also Read
మరోపక్క పెద్ది, డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారి తరఫున క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ ఊరి ఎమ్మెల్యే కూతురు అచ్చి అమ్మ (జాన్వీ కపూర్) కోసం, తాను ఎవరి కోసం అయితే క్రికెట్ ఆడతాడో వారితోనే గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వారంతా అతన్ని అవమానించి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతారు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండి ఎంతోమందికి కుస్తీ నేర్పిస్తూ ఉండే గౌరీ నాయుడు (శివ రాజ్‌కుమార్) దగ్గర కుస్తీ నేర్చుకోవడానికి చేరుతాడు.
కుస్తీలో నేషనల్స్ సాధించి తన ఊరికి గుర్తింపు తీసుకురావాలని తాపత్రయపడుతున్న క్రమంలో, ఒక ఊహించని సంఘటన పెద్ది జీవితాన్ని తారుమారు చేస్తుంది. తన ఊరి బాగు కోసం ఢిల్లీ బయలుదేరిన పెద్ది ఏం చేశాడు? అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ సంఘటన ఏంటి? ఆ సంఘటన తరువాత కూడా తన ఊరి కోసం పెద్ది ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఎంతవరకు సఫలమయ్యాడు? చివరికి అతని ఊరిలో ట్రైన్ ఆగిందా లేదా అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
నిజానికి రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే, కచ్చితంగా అది కమర్షియల్ హంగులు ఉన్న పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఇదే విషయాన్ని ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి దర్శకుడు బుచ్చిబాబు చెబుతూ వచ్చాడు. అయితే కొంతవరకు కమర్షియల్టీ కోసం పాటలు లాంటివి పెట్టినా సరే, ఇది పూర్తిస్థాయిలో ఒక స్టార్ హీరో చేయదగ్గ రొటీన్ సినిమా అయితే కాదు. కానీ ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే రామ్ చరణ్ ధైర్యం కనిపిస్తుంది.
వాస్తవానికి ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ప్రకారం పెద్ద పెద్ద దర్శకులతో, హీరో ఎలివేషన్లతో ఎన్నో భిన్నమైన సినిమాలు చేయవచ్చు. కానీ ఒక క్రీడా నేపథ్యంతో యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ సాగే ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే రామ్ చరణ్ తొలుత సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా ఫస్టాఫ్‌లో క్రీడా శాఖలో పనిచేసే బోమన్ ఇరానీ, క్రీడా స్ఫూర్తిని వెతుక్కుంటూ వెళ్లడంతో కథ మొదలవుతుంది. విజయనగరం జిల్లా నుంచి అతను వెళుతున్న సమయంలో అక్కడి ఆటగాళ్లు అందరూ “పెద్ది పెద్ది” అంటూ ఉండడంతో, ఆ పెద్ది కథ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సాగుతాడు. అలా మొదలైన పెద్ది ప్రయాణం ప్రేక్షకులను ఎమోషన్స్‌కి గురి చేస్తుంది. నిజంగానే ఆ పెద్ది కథను పక్కనుండి ట్రావెల్ చేసి తెలుసుకుంటున్న ఫీలింగ్ కలిగించేలా దర్శకుడు తెరకెక్కించాడు.
ఫస్టాఫ్ అంతా పెద్ది పాత్ర పరిచయం, ఆ తర్వాత అతని క్రికెట్ మెళుకువలు… ఆ క్రికెట్ ట్రాక్ సాగిపోతూ ఉండగా, ఆ తర్వాత అతను కుస్తీ వైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. నిజానికి ఫస్టాఫ్ చాలా వరకు లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఒక్కసారి వేగం పెంచుకున్న తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం చాలా పగడ్బందీగా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు దర్శకుడు. తర్వాత కుస్తీ కోసం రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లడం, అక్కడ కుస్తీ ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈ రెండు ఆటలు కాకుండా రామ్ చరణ్ మూడవ ఆట వైపు వెళ్లాల్సిన పరిస్థితులను చాలా ఎమోషనల్ గా రాసుకున్నాడు.
నిజానికి ఇది పెద్ది ప్రయాణం మాత్రమే కాదు, అతని పోరాటం అనిపించేలా రాసుకున్న డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సర్వసాధారణంగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో, ఒక క్రీడా స్ఫూర్తిని యువతలో రగిలించే విధంగా ఈ కథ రాసుకున్న బుచ్చిబాబు కచ్చితంగా ఒక సాహసం చేశాడని చెప్పాలి. ఆ సాహసాన్ని స్వీకరించి రామ్ చరణ్ మరో సాహసం చేశాడనే చెప్పాలి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక నిజానికి రామ్ చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ ముందు, ‘రంగస్థలం’ తర్వాత అనేలా అతని నటన గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ ‘పెద్ది’లో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత… పెద్దికి ముందు, పెద్దికి తర్వాత అనేలా అతని నటన గురించి మాట్లాడుకుంటారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు సైతం లభిస్తుంది అని చిత్ర యూనిట్ చెప్పుకున్న మాటల్లో ఏమాత్రం తప్పులేదు అనిపించేలా రామ్ చరణ్ నటన ఉంది.
జాన్వీ కపూర్ పాత్ర అంతంత మాత్రమే కనిపించినా, కొద్దిసేపు అందాల ఆరబోతకే ఆమె పాత్ర పరిమితమైనది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత అంతటి మంచి పాత్ర పడింది మాత్రం జగపతిబాబుకే. అప్పలసూరి పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా నటించి, తర్వాత విలన్‌గా నటిస్తున్న జగపతిబాబు ఈ పాత్ర చేసిందా అని అనుమానం కలిగించేలా అతని నటన ఉంది. ఇక దివ్యేందు శర్మ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించాడు. శివ రాజ్‌కుమార్ కూడా కనిపించినంత సేపు గంభీరంగా తనదైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే… ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో అయితే, సినిమాకు మాత్రం దర్శకుడే హీరో. ఇలాంటి కథ రాసుకున్న బుచ్చిబాబు, దాన్ని అంతే నిజాయితీగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల డైలాగ్స్ హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు టెక్నికల్ టీం పరంగా ప్రాణం పోసింది ఏఆర్ రెహమాన్. ఆయన పాటలే కాదు, నేపథ్య సంగీతం (BGM) కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. పీరియాడిక్ సెటప్ కాబట్టి అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం చాలా ఫ్రేమ్స్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాన్సిషన్ షాట్స్ సహా కొన్ని షాట్స్ అయితే రత్నవేలు కెరీర్లోనే ది బెస్ట్ అనిపించేలా డిజైన్ చేశారు. ఎడిటింగ్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కానీ, మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు ఆశించి థియేటర్‌కి వెళ్లే వారికి ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు, కానీ ఈ టీం చేసిన ప్రయత్నం మాత్రం అభినందనీయం.
ఓవరాల్‌గా ఈ పెద్ది అందరికీ గుర్తుండిపోతాడు!
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!