Adipurush Review: ఆదిపురుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: ప్రభాస్ (రాముడు, దశరథుడు), కృతి సనన్ (సీత), సైఫ్ అలీ ఖాన్ (రావణుడు), సన్నీ సింగ్ (లక్ష్మణుడు), దేవదత్త నాగె (భజరంగ్), విశాల్ సేథ్ (మేఘనాథుడు), సోనాల్ చౌహాల్ తదితరులు
- DIRECTOR: ఓమ్ రౌత్
- MUSIC: అజయ్ అతుల్, సాచెట్-పరంపర, సంచిత్ బల్హరా, అంకిత్ బల్హారా
- PRODUCER: భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
తెలుగువారికి, పురాణ కథలకు ఎంతో అవినాభావ సంబంధషం ఉంది. తెలుగువారు తీసిన పలు పౌరాణిక చిత్రాలు బలమైన ముద్రవేశాయి. ప్రత్యేకించి రామాయణ, మహా భారత కథల ఆధారంగా మన వారు తెరకెక్కించిన పలు సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేశాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తాకరరామారావు పలు పౌరాణిక పాత్రలు పోషించి నభూతో నభవిష్యత్ అనిపించుకున్నారు. ఆయన అవతార పురుషుడు రాముడుగానే కాదు రావణుడుగాను నటించి మెప్పుపొందిన తీరు అనన్య సామాన్యం. ఆయన తర్వాత పౌరణిక చిత్రాలకు కళ తగ్గింది అని చెప్పటానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు. జగదభిరాముడు శ్రీరాముని కథలో తెలుగులో పలుచిత్రాలు రూపొంది వేటికవే సాటి అనిపించుకున్నాయి. ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు రామయణ కథతో ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించి మెప్పించారు. ఆ తర్వాత ఇన్నాళ్ళకు రామాయణం ఇతివృత్తం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ను రూపొందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ రిలీజ్ అయినపుడు అనూహ్యంగా ట్రోలింగ్ ను ఫేస్ చేసిన ‘ఆదిపురుష్’, పాట, ట్రైలర్ తో పాజిటీవ్ బజ్ ను క్రియేట్ చేసింది. రిలీజ్ టైమ్ కి సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
కథ విషయానికి వస్తే వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథ రాముడి వనవాసంతో మొదలవుతుంది. దానికి ముందు టైటిల్స్ లోనే సీతాస్వయంవరం, రాముడు పట్టాభిషేకం, కైక కోరిక మేరకు తండ్రిమాట జవదాటని శ్రీరాముడు వనవాసానికి పయనం అవటం చూపించారు. ఇక వనవాసంలో శూర్పణఖ శ్రీరాముని మోహించి తిరస్కరణకు గురికావటం,ఆమెకు లక్ష్మణుడు బుద్ధి చెప్పటం… దానిని ప్రతిగా తన అన్న రావణుని రెచ్చగొట్టి జానకిపై మోహం పెరిగేలా చేయటం, రావణుడు మాయలేడి సాయంతో జానకిని ఎత్తుకురావడం. జటాయువు సూచన మేరకు శ్రీరామ, లక్ష్మణులు సుగ్రీవ, ఆంజనేయుల అండతో లంకపైకి దండెత్తి రావణుడి సంహరించి సీతను తీసుకువచ్చి పట్టాభిషిక్తుడు కావటం.
Also Read
నిజానికి రామాయణంలో లేని అంశం లేదు. నవరసాలు ఉన్న అద్భుతమైన పౌరాణిక గాథ. అందులోని బాలకాండ, అయోధ్య కాండ, అరణ్యకాండ, కిష్కింద కాండ, సుందర కాండ, యుద్ధ కాండ, ఉత్తర కాండ… ఏది తీసుకుని సినిమా తీసినా తనివి తీరదు. ఆసక్తి తగ్గదు. అంతటి సమ్మోహన శక్తి ఉన్న పౌరాణిక కథ రామాయణం. దీనిని ఎవరు ఎన్ని రకాలుగా తీసినా మూల కథ విషయంలో ఒక నిబద్ధతను పాటించి తీశారు. అందుకే దాదాపు అందరూ వారి వారి స్థాయికి తగ్గ సక్సెస్ ను అందుకున్నారు. అయితే బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ మాత్రం పెరిగిన టెక్నాలజీని ఆదిపురుష్ సినిమాకి జోడించి మోషన్ క్యాప్చర్ సినిమా చేసాడు. తెలిసిన కథే కావడంతో దర్శకుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, అందుకే కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. అయితే ఇక్కడే అసలు తప్పు జరిగింది. రెగ్యులర్ సినిమాకి వెళ్లకుండా మోషన్ క్యాప్చర్ కి వెళ్లడం దగ్గరే ఆదిపురుష్ కష్టాలు మొదలయ్యాయి. టీజర్ తోనే ఇది తెలిసినా, ట్రైలర్ తో మెప్పించాడు ఓమ్ రౌత్. సినిమా విషయంలో మాత్రం ఇది జరగలేదు. గ్రాఫిక్స్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఆ విజువల్స్ కి, సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి, ప్రభాస్ ని ప్రెజెంట్ చేసిన విధానంకి దర్శకుడు కాస్త గ్రాఫిక్స్ విషయంలో కేర్ తీసుకోని ఉంటే ఈరోజు ఒక అద్భుతాన్ని భారతీయులు చూసే వారు.
ప్రభాస్ తన పరిధిలో చేయాల్సిందంతా చేసాడు, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. సీతగా కృతి సనన్ ఎందుకో రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. ఆమెని చూస్తే సీత పాత్రపై ఉండే ఎమోషల్ కనెక్టివిటీ రావట్లేదు. హనుమంతుడు, లక్ష్మణుడు పాత్రలని దర్శకుడు బాగా మలిచాడు. రావణ్ గా సైఫ్ కూడా బాగానే ఉన్నాడు కానీ ప్రభాస్ ముందు అతను సరిపోలేదు.
సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘ఆదిపురుష్’ లో జై శ్రీరామ్ పాట తప్ప మిగిలిన పాటలేవీ బాగాలేవు. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. జై శ్రీరామ్ పాటను అక్కడక్కడా నేపథ్యంలో వినిపించటం చాలా వరకూ కలసి వచ్చింది. కార్తీక్ పళని కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణాత్మక విలువలు చెప్పుకోవాలంటే విజువల్ ఎఫెక్ట్స్ కు బాగానే ఖర్చుపెట్టారు కానీ అది ఆడియన్స్ ని మెప్పించడానికి సరిపోలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఓమ్ రౌత్ రామాయణంను ఓ దృశ్యకావ్యంగా మలుస్తాడని భావించి థియేటర్లకు క్యూ కట్టిన వారిని కాస్త డిజప్పాయింట్ చేసే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్
ప్రభాస్ నటించటం
నిర్మాణాత్మక విలువలు
ప్రాచుర్యం పొందిన కథ కావటం
మైనస్ పాయింట్స్
గ్రాఫిక్స్
ఎమోషన్ లేకపోవడం
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: ‘ఆదిపురుష్’… గ్రాఫిక్ గందరగోళం
తాజావార్తలు
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!