Oh Sukumari Review: ఓ సుకుమారి మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Thiruveer, Aishwarya Rajesh and others
- DIRECTOR: Bharath Darshan
- MUSIC: Bharath Manchiraju
- PRODUCER: Maheswhar Reddy Muli
తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా రూపొందిన తాజా చిత్రం ‘ఓ సుకుమారి’. “ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు భరత్ దర్శన్. మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
ఓ సుకుమారి కథ
యాదగిరి (తిరువీర్) తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరిలో సర్పంచ్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని తమ్ముడు (గవిరెడ్డి)తో పెద్దగా పడదు. వీరి తాత “80 ఎకరాల ఆస్తి ఈ అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరికి ముందు మగ బిడ్డ కలిగితే వారికి చెందాలి” అని వీలునామా రాసి ఉంచడంతో, ఇద్దరూ పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. అన్నకంటే ముందే తమ్ముడు, అప్పటికే గర్భంతో ఉన్న ఒక మార్వాడీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు. ఈ క్రమంలోనే యాదగిరి కూడా ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లి, అదే ఊరికి చెందిన దామిని (ఐశ్వర్య రాజేష్)ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఆ తర్వాత ఆమె తండ్రితో మాట్లాడి ఆమెను వివాహం సైతం చేసుకుంటాడు. అయితే, “ఆమెను ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే విషయం దాచి, ఆమెకు ఆ ఊరంతా కలిసి పెళ్లి చేస్తారు. శోభనం రోజు రాత్రి ఈ విషయం తెలిసి తిరువీర్ ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకుంటాడు. అసలు దామినిని ముట్టుకుంటే ఎందుకు షాక్ తగులుతుంది? ఈ విషయం తెలిసిన తర్వాత యాదగిరి ఏం చేశాడు? చివరికి తాత చెప్పిన 80 ఎకరాలు ఎవరికి దక్కాయి? అసలు ఫైనల్‌గా ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
హీరోయిన్‌కి ఒక సమస్య లేదా హీరోకి ఒక సమస్య పెట్టి, దాని చుట్టూ కథ రాసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువవుతోంది. ఒక రకంగా ఇది కూడా అలాంటి కోవకు చెందిన సినిమానే. విషయం ఏమిటంటే, ఒక చిన్నారి చిన్నప్పుడే జరిగిన ఒక అనుకోని ప్రమాదంతో, ముట్టుకుంటే షాక్ కలిగేలాంటి ఒక వింత సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆ చిన్నారి పెరిగి పెద్దయ్యాక ఆమె వల్ల ఊరి జనం ఎలా ఇబ్బందులు పడ్డారు అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు.
నిజానికి ఇది కథగా చెప్పుకోవడానికి బాగుంది కానీ, స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కొంత తడబడినట్లు అనిపిస్తుంది. తెలంగాణ యాసలో కొన్ని వన్-లైనర్ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ, ఫుల్-ఫ్లెడ్జ్‌డ్‌గా సినిమా చూస్తున్నప్పుడు ఎందుకో పూర్తిస్థాయిలో కాన్ఫ్లిక్ట్ వర్కౌట్ అవుతున్న ఫీలింగ్ కలగదు. నిజానికి సినిమా లైన్ గా చూసుకున్నప్పుడు బానే ఉంది కానీ, ఆ ఎమోషన్స్‌ను స్క్రీన్ మీదకు తీసుకురావడంలో ఎక్కడో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.
నిజానికి ముట్టుకుంటే షాక్ కొట్టడం అనే కాన్సెప్ట్ ఉన్నా… కొన్నిసార్లు ముట్టుకుంటే షాక్ కొట్టడం, కొన్నిసార్లు షాక్ కొట్టకపోవడం ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని సరిగ్గా రిజిస్టర్ చేయడంలో ఇబ్బంది పడినట్లే అనిపిస్తుంది. నిజానికి దామిని ఎప్పుడు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఎప్పుడు షాక్ కొట్టదు అనే విషయాన్ని ఇంకా బాగా అర్థమయ్యేలా రిజిస్టర్ చేయడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే, తిరువీర్ మరోసారి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. చాలా ఈజ్‌తో తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపించింది. భార్యా బాధితుడైన భర్త పాత్రలో మరోసారి తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ గతంలో చేసిన తెలుగు సినిమాలతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైన పాత్ర. యాక్ట్ చేసే స్కోప్ దొరికిన ఈ పాత్రలో ఆమె అదరగొట్టింది. ఇక ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక విషయానికి వస్తే, పాటలు సినిమాకి అడ్డుగా అనిపించలేదు, ఫ్లోలో వెళ్లిపోయాయి, బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ వర్డిక్ట్: ‘ఓ సుకుమారి’ – షాకింగ్ కాన్సెప్ట్‌తో పాటు కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్న చిత్రం!
తాజావార్తలు
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!