నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. గతంలో భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తూ ఉండడం , ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేయడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
రాబిన్ హుడ్ కథ:
రామ్ (నితిన్) ఓ అనాథ. శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాధ ఆశ్రమంలోనే పెరుగుతాడు. అనాధాశ్రమానికి విరాళాలు లేక పిల్లల తిండికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు. పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంట బట్టించుకుని రాబిన్ హుడ్ అనే నిక్ నేమ్ తో బడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్ హుడ్ ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ (షైన్ చాం టాకో) రంగంలోకి దిగుతాడు. దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీ లీల) వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకు వెళ్తారు. అలా వెళ్లిన తర్వాత అక్కడ సామి (దేవదత్తా నాగే) వలలో చిక్కుకుంటారు. వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అండ్ టీం తప్పించిందా? అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు? చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ :
ఈ సినిమా కథ కొత్తది అని చెప్పలేం. ఎందుకంటే గతంలో ఇలాంటి లైన్ తోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. అనాధాశ్రమంలో పెరిగే ఒక కుర్రాడు అక్కడి వారి బాధలు చూసి దొంగగా మారడం, ఆ తర్వాత వరుస దొంగతనాలు చేస్తూ మధ్యలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ సాగే లైన్లో మనం గతంలో కొన్ని సినిమాలు చూశాం. ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్ లో సాగుతుంది. అయితే ఫస్ట్ సినిమా మొదలైన కొద్దిసేపటి వరకు సినిమా టైటిల్ అయిన రాబిన్ హుడ్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలా హీరో ఎందుకు దొంగగా మారాడు అనే విషయాన్ని చూపించారు. తరువాత నీరా వాసుదేవ్ ఎంట్రీ ఇచ్చిన క్రమంలో సినిమా కామెడీతో పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్- నితిన్- వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇంట్రెస్టింగ్ గా అనిపించని ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా నీరసపడిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈజీగానే గుర్తుపట్టేయగలడం ఈ సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే అలా ఫీల్ అయ్యే లోపే ఊహించని అనేక ట్విస్టులు సినిమాలో ఉండేలా రాసుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో కామెడీ కాస్త క్రింజ్ అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల నవ్వించేలా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కధ అయినా కామెడీతో బండి నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకి కుడుముల కొంతవరకు సక్సెస్ అయ్యాడు కూడా అయితే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఫీలింగ్ కలుగుతుంది యాక్షన్ సీక్రెట్స్ తో పాటు మిగతా సినిమా అంతా సెకండ్ పార్ట్ లోనే ఉండడంతో ఆ కామెడీ సెకండ్ పార్ట్ లో మిస్ అవుతారు ఓవరాల్ గా చూసుకుంటే కథలో కొత్తదనం లేకపోయినా కామెడీతో పాటు రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్క్ అవుట్ అవ్వడంతో సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఆలోచించేస్తూ ఆకట్టుకుంటుంది.
నటీనటుల విషయానికి వస్తే నితిన్ ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన ఒక బ్రెయిన్ గేమ్ ఆడే రాబిన్హుడ్ టైపు పాత్రలో మెరిశాడు. రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ లో మాత్రం పలు సీన్స్ లో ఆకట్టుకున్నాడు. శ్రీ లీల పాత్ర పరిమితమైనా అందాల ఆరబోతతో పాటు కొన్ని సీన్స్ లో మెప్పించింది. దేవ దత్త పాత్ర భయపెడుతూనే చివరిలో తుసుమనిపించేలా చేసింది. అలాంటి పవర్ఫుల్ విలన్ ను ఇంకా ఏదైనా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులను నిరాశ పరుస్తూ జైలు పాలు చేయడం గమనార్హం. అయితే డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువ సేపు అయినా సరే ఆయనను చూడగానే థియేటర్స్ లో విజిల్స్ పడేలా స్క్రీన్ ప్రజన్స్ ఉంది. ఇక శుభలేఖ సుధాకర్, లాల్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ వంటి వాళ్ళు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ గురించి. ఎందుకంటే మనోడు ఇచ్చిన సాంగ్స్ సినిమాని ప్రేక్షకుల్లోకి బాగా తీసుకువెళ్లాయో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. ఇక అదిదా సర్ప్రైజ్ సాంగ్ లోని స్టెప్ విషయంలో టీం కేర్ తీసుకుంది. ఆ స్టెప్ విషయంలో కెమెరా జూమ్ చేసి సర్ప్రైజ్ కి కోత పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ లు స్టైలిష్ గా ఉన్నాయి. డైలాగ్స్ ట్రెండీగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఓవరాల్ గా రాబిన్ హుడ్ ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైనర్ విత్ మెసేజ్.