Missing Meghana Review : ‘మిస్సింగ్ మేఘన’ మూవీ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, కౌశిక్, గోపరాజు రమణ తదితరులు
- DIRECTOR: వాచస్పతి
- MUSIC: ఆర్ఆర్ ధృవన్
- PRODUCER: పంచుమర్తి నరేష్ బాబు
క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఒక సాధారణ మిస్సింగ్ కేసు.. తీగ లాగితే డ్రగ్స్, మర్డర్స్ చుట్టూ అల్లుకున్న చీకటి కోణాలు వెలుగుచూస్తే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తోనే సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ & కో బ్యానర్స్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు వాచస్పతి దర్శకత్వం వహించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు థ్రిల్ చేసిందో ఈ రివ్యూలో చూద్దాం.
మిస్సింగ్ మేఘన కథ
మేఘన (అమ్ము అభిరామి) అనే యువతి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కథ మొదలవుతుంది. కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి (గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. కానీ, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. మేఘనకు కాబోయే భర్త, ఏసీపీ అర్జున్ (కౌశిక్) స్వయంగా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ విచారణలో మేఘనను చివరిసారిగా డ్రాప్ చేసిన బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్) పోలీసులకు చిక్కుతాడు. మేఘనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కార్తీక్ బుకాయించినా, అతని గత ప్రేమకథ, మేఘనతో ఉన్న కాల్ రికార్డులు బయటపడటంతో కేసు ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు మేఘన ఏమైంది? కార్తీక్‌తో ఆమెకున్న లింక్ ఏంటి? ఈ మిస్సింగ్ మిస్టరీ వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? అన్నదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని కేవలం ఒక మిస్సింగ్ మిస్టరీగా మాత్రమే కాకుండా.. ప్రేమ, క్రైమ్, డ్రగ్స్, సీరియల్ మర్డర్స్ లాంటి బహుళ కోణాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మలిచారు. అయితే, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి మొదటి సగంలో ఎక్కువ సమయం తీసుకోవడంతో నరేషన్ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కానీ, విరామానికి ముందు వచ్చే ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ద్వితీయార్ధం మొదలవగానే కథ పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి మారిపోయి వేగం పుంజుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడే నిజాలు, హీరో-పోలీసులు కలిసి కేసును ఛేదించే విధానం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అయితే, థ్రిల్లర్ సినిమాలకు ప్రాణమైన ‘సస్పెన్స్ రివీల్’ దగ్గరే దర్శకుడు కాస్త తడబడ్డాడు. విలన్ ఎవరనేది పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించకపోవడం, కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ముందే పసిగట్టేయడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ కూడా రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్ ఫార్మాట్లోనే సాగుతుంది. అయినప్పటికీ, క్రైమ్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ ట్రాక్ సినిమాను నిలబెట్టాయి.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే టైటిల్ రోల్ పోషించిన అమ్ము అభిరామి మేఘన పాత్రలో ఒదిగిపోయింది. తన క్యూట్‌నెస్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అద్భుతమైన నటన కనబరిచింది. బైక్ రైడర్ కార్తీక్ పాత్రలో రామ్ కార్తీక్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లవ్ ఫెయిల్యూర్ సీన్స్‌తో పాటు, సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ బ్లాక్స్లోనూ ఆకట్టుకున్నాడు. ఏసీపీ అర్జున్‌గా కౌశిక్ తన ఎనర్జిటిక్ పోలీస్ స్వాగ్తో మెప్పించగా, అంకిత్ కొయ్య తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేశాడు. తండ్రి పాత్రలో సీనియర్ నటుడు గోపరాజు రమణ మరోసారి తన సహజ నటనతో కట్టిపడేశారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తేసాంకేతికంగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్ పాయింట్. క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన డార్క్ అండ్ ఇంటెన్స్ విజువల్స్ ను కెమెరామెన్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఆర్ఆర్ ధృవన్ అందించిన పాటలు బాగున్నాయి కానీ.. థ్రిల్లర్ జానర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాల్సిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఇంకాస్త పవర్ఫుల్ గా ఉంటే ఇంపాక్ట్ వేరేలా ఉండేది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఫస్ట్ హాఫ్‌లో ఉన్న అనవసరమైన ల్యాగ్‌ను కత్తిరించి ఉంటే సినిమా ఇంకాస్త క్రిస్ప్ గా, ఎంగేజింగ్‌గా మారేది. నిర్మాణ విలువలు కథకు సరిపడా రిచ్ గా ఉన్నాయి.
చివరిగా ‘మిస్సింగ్ మేఘన’ థ్రిల్లర్ లవర్స్‌కు నచ్చే అటెంప్ట్
తాజావార్తలు
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..