12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Signature 27 India Launch: మోటరోలా (Motorola) భారత మార్కెట్లో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Motorola Signature 27 పేరుతో అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 9న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇందులో డిస్ప్లే, ప్రాసెసర్ విషయానికి వస్తే.. Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో Wi-Fi 8, మెరుగైన 5G కనెక్టివిటీ కోసం 6-యాంటెన్నా వ్యవస్థను ఏర్పాటు చేశారు. గేమింగ్, ఏఐ టాస్క్‌ల సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ArcticMesh కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో మైక్రో-డైమండ్ థర్మల్ జెల్, గత తరంతో పోలిస్తే 40% పెద్దదైన వేపర్ ఛాంబర్ ఉన్నాయి.
Also Read
- NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
- WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
- చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K Super HD రిజల్యూషన్‌తో కూడిన Extreme AMOLED Duo డిస్ప్లేను అందించారు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న ఈ స్క్రీన్ టాండమ్ ఎమిసివ్ లేయర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని గరిష్ఠ బ్రైట్నెస్ ఏకంగా 12,000 నిట్స్ వరకు ఉంటుంది. సాధారణ AMOLED డిస్ప్లేలతో పోలిస్తే 34% మెరుగైన ఎనర్జీ ఎఫిషియన్సీ, 121% ఎక్కువ ప్యానెల్ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే Pantone Validation, SGS సర్టిఫైడ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి.
కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్లో DXOMARK గోల్డ్ లేబుల్ అందుకున్న మల్టీ-సెన్సార్ కెమెరా వ్యవస్థను అందించారు. ఇందులో LOFIC టెక్నాలజీతో ఉన్న 50MP Sony LYTIA L910 ప్రైమరీ కెమెరా ఉంది. ఇది కాంతి ఎక్కువగా, తక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ మెరుగైన ఫొటోలను అందించేందుకు ఉపయోగపడుతుంది. 3.5 డిగ్రీల ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), Qualcomm ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
A new benchmark in design, camera and intelligence. Meet the new Motorola Signature 27. https://t.co/aormfBo77T
— Motorola India (@motorolaindia) November 23, 2026
వీటితో పాటు 3X ఆప్టికల్ జూమ్, 100X హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేసే 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. వేగంగా కదిలే వస్తువులను గుర్తించి ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు ప్రత్యేకంగా Event-Based Vision Sensor (EVS)ను అమర్చారు. ఇక 50MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, ఏఐ వీడియో ఎన్హాన్స్మెంట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
మొబైల్ బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిని ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించారు. వెనుక భాగంలో సిరామిక్, గ్లాస్ ప్యానెల్‌ను ఉపయోగించారు. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3ను అందించారు. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. పాంటోనే కోల్ స్మోక్, పాంటోనే క్యాప్యూల్ట్ ఆలివ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అలాగే ఇందులో భారీ 7,000mAh బ్యాటరీని అందించారు. 90W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
సాఫ్ట్వేర్, సెక్యూరిటీ ఫీచర్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అందించనున్నట్లు మోటరోలా ప్రకటించింది. హార్డ్‌వేర్ స్థాయిలో ARM Memory Tagging Extension (MTE) టెక్నాలజీని అందించారు. ఇది మెమరీ సంబంధిత భద్రతా లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్లలో లభించనుంది. డిసెంబర్ 9న భారత్‌లో అధికారికంగా లాంచ్ అయిన తర్వాత Motorola అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్ రోజునే ధరపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ నువ్ ఓ కెప్టెన్.. మైదానంలోనే అలా చేయడం సరికాదు!
-
Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
-
NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
-
Astrology: నవంబర్ 24 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారు.. ఈ పరిహారం చెల్లించండి..!
ట్రెండింగ్
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!