Happy Journey Movie Review: ‘హ్యాపీ జర్నీ’ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Vamshidhar Goud, Payal Radhakrishna, Ravi Siva Teja, Sunaina Badam, Annapurnamma, Aamani and Others
- DIRECTOR: Abhiramm Naidu
- MUSIC: Shekar Chandra
- PRODUCER: Balaji Gutta
ఫీమేల్ ఓరియెంటెడ్ కథలకు, విమెన్ ఎంపవర్మెంట్ సబ్జెక్టులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరిస్తూ ఉంటారు మేకర్స్. విభిన్న నేపథ్యాలు, వేర్వేరు వయసులు ఉన్న మహిళలు అంతా కలిసి ఒకేసారి ఫారిన్ ట్రిప్ కు వెళితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో అభిరామ్ నాయుడు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీలతో పాటు పాయల్ రాధాకృష్ణ, సునయన తదితరులు కలిసి నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ జర్నీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
హ్యాపీ జర్నీ కథ:
సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునయన), విహాన (రూప శ్రీనివాస్).. ఇలా వివిధ సామాజిక వర్గాలు, భిన్న వయసులకు చెందిన ఏడుగురు మహిళలకు ఒక లక్కీ డ్రాలో యూరప్ వెళ్లే అవకాశం దక్కుతుంది. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ ఏజెన్సీని నడిపే గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) వీరికి గైడ్స్ గా వ్యవహరిస్తారు. కేవలం ఒక సరదా వెకేషన్ లా మొదలైన వీరి ట్రిప్.. మెల్లగా ఒకరికొకరు అర్థం చేసుకునే ఎమోషనల్ జర్నీగా ఎలా మారింది? ఈ ప్రయాణంలో వాళ్ళు తమ జీవితాల గురించి తెలుసుకున్న నిజాలు ఏంటి? విడిపోయిన వారి కుటుంబాలు మళ్లీ ఎలా కలిశాయి? అన్నదే మిగతా కథ.
Also Read
హ్యాపీ జర్నీ విశ్లేషణ:
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్, ఇవ్వాలనుకున్న సందేశం చాలా నిజాయితీగా ఉంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఒక వర్గం ప్రేక్షకులకు ఈ కాన్సెప్ట్ సులభంగా కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా సినిమా నవ్విస్తుంది.. ముఖ్యంగా టూర్ గైడ్ వంశీకి, ఆ ఏడుగురు మహిళల మధ్య వచ్చే సంభాషణలు, ఫన్ మూమెంట్స్ చక్కటి రిలీఫ్ ఇస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా నీట్ గా వర్కవుట్ అయింది. అయితే, కాన్సెప్ట్ లో ఉన్న బలం స్క్రీన్ ప్లేలో కనిపించదు. కథనంలో ఒక కన్సిస్టెన్సీ లోపించడంతో ఈ ప్రయాణం కాస్త ఎగుడుదిగుడుగా అనిపిస్తుంది. మహిళల వ్యక్తిగత సమస్యలను, వాళ్ళ ఎమోషన్స్ ను ఇంకాస్త డెప్త్ గా చూపించి ఉంటే ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయ్యేది. ఫన్ కు, ఎమోషన్ కు మధ్య సరైన బ్యాలెన్స్ కుదరలేదు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగాల్సిన సెకండాఫ్ లో.. పాత్రల మధ్య ఉన్న అపార్థాలు చాలా ఆదరాబాదరాగా, హడావుడిగా పరిష్కారం అయిపోతాయి. దీనివల్ల క్లైమాక్స్ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా రిపీట్ అవ్వడంతో పాటు, మరికొన్ని సీన్లు మరీ క్లాస్ పీకినట్లు ఉండటం సినిమాకు మైనస్. అడపాదడపా నవ్వించే ఫన్ మూమెంట్స్, అన్నపూర్ణమ్మ మోడ్రన్ యాక్టింగ్, కళ్లు చెదిరే యూరప్ విజువల్స్ కోసం ఈ జర్నీ చేయొచ్చు
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ. ఇన్నాళ్లూ ఒక పద్ధతిలో కనిపించిన ఆమె.. ఇందులో తన మోడ్రన్ అవతార్ తో అదరగొట్టేశారు. తన అపారమైన అనుభవాన్ని తెరపై చూపించారు. ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునయన, రూప శ్రీనివాస్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించి అన్నపూర్ణమ్మకు బలమైన సపోర్ట్ ఇచ్చారు. ఇక గైడ్స్ గా చేసిన వంశీ, రవి శివతేజ తమ అద్భుతమైన కామిక్ టైమింగ్ తో సినిమాను చాలా చోట్ల నిలబెట్టారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, పంచ్ డైలాగులు బాగా పేలాయి.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే టెక్నికల్ గా చూస్తే సుబ్రమణియన్ మణిగండన్ సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. యూరప్ అందాలను, అక్కడి లొకేషన్లను తన కెమెరా కంటితో అద్భుతంగా, రిచ్ గా బంధించారు. సెకండాఫ్ స్టార్టింగ్ లో వచ్చే ఒక పాట మినహా, మిగతా ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను శేఖర్ చంద్ర నీట్ గా కంపోజ్ చేశారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. హేమంత్ ధోమ్ రాసిన స్టోరీ లైన్ బాగున్నా, దానికి తగ్గ పకడ్బందీ స్క్రీన్ ప్లే లేకపోవడమే ప్రధాన లోపం. కామెడీ సీన్లను బాగా డీల్ చేసిన దర్శకుడు అభిరామ్ నాయుడు.. నరేషన్ లో, ఎమోషన్స్ పండించడంలో మాత్రం తడబడ్డాడు.
ఫైనల్లీ : ఈ ‘హ్యాపీ జర్నీ’ హ్యాపీనే కానీ….
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!