Hanuman Ansh Review: ‘హనుమాన్ అంశ్’ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Shobhinaw Satyaa, Purnima Tiwari, Gulshan Pandey, Anil Rastogi
- DIRECTOR: Vishal Chaturvedi
- MUSIC: Sadhu Tiwari, Dhirendra Mulkalwar
- PRODUCER: Vishal Chaturvedi, Anupriya Nagar, Ragini Sona
హిందీలో అతి స్వల్ప వ్యయం అంటే రూ. 2 కోట్లు తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద అసాధారణ వండర్ క్రియేట్ చేసిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు, సిద్ధపురుషుడు నీమ్ కరోలీ/నీబ్ కరోరి బాబా జీవిత గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా చిత్రం తాజాగా తెలుగులో విడుదలైంది. మరి ఈ డివైన్ జర్నీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
ఈ కథ భారత స్వాతంత్రం రాక ముందుది. డాక్టర్ రామ్ నందన్ భోంస్లే (చందన్ ఆనంద్) ఒక నిఖార్సయిన స్వాతంత్ర్య సమరయోధుడు, కరడుగట్టిన నాస్తికుడు. దైవత్వాన్ని ఏమాత్రం అంగీకరించని ఆయన ఆలోచనా ధోరణిని ఓ ఆకస్మిక సంఘటన తీవ్రంగా కుదిపేస్తుంది. ఆ అనూహ్య మలుపులోనే ఆయనకు లక్ష్మీనారాయణ శర్మ (శోభినవ్ సత్య) పరిచయమవుతారు. ఆ సాధారణ బ్రాహ్మణ యువకుడు కాలక్రమంలో తపస్సు, అనుగ్రహంతో ‘నీమ్ కరోలీ బాబా’గా ఎలా అవతరించారు? ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఎందరి బతుకుల్లో వెలుగులు నింపారు? ఆయన జీవితంలో చోటుచేసుకున్న అలౌకిక లీలలు ఏమిటి? అనే అంశాల సమాహారమే ఈ సినిమా.
Also Read
విశ్లేషణ:
భక్తి కథాంశాలకు ప్రథమంగా కావలసింది ప్రేక్షకుడిని ఆత్మీయంగా కట్టిపడేసే అనుభూతి. ఆ కోణంలో ‘హనుమాన్ అంశ్’ చక్కని అనుభవాన్ని పంచుతుంది. బ్రిటిష్ అధికారితో ట్రైన్లో సాగే ఓ సన్నివేశం, పార్వతి ఇంట్లో అన్నం తినే సన్నివేశం, ఇంటర్వెల్ ముందు శివతత్వాన్ని ఆవిష్కరించే విజువల్స్ ప్రేక్షకులలో బలమైన ముద్ర వేస్తాయి. అయితే, కమర్షియల్ మీటర్ ఆశించే వారికి ఈ సినిమా కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన కలిగిస్తాయి. బాబా చరిత్రపై ముందస్తు పరిచయం లేని వారికి కొన్ని ఘట్టాలు కాస్త రిపీట్ ఫీలింగ్ కూడా కలిగించవచ్చు. అయితే ఈ తరహా సినిమాలు అన్ని వర్గాల వారికి నచ్చాలనే రూల్ లేదు.. కాబట్టి టార్గెట్ ఆడియన్స్ మాత్రం ఆనందించి బయటికి వచ్చేలా సినిమాని డిజైన్ చేసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. నిజానికి తెలుగు రాష్ట్రాల వారికి సాయిబాబా పరిచయస్తుడు అంటే ఒక రకంగా ఆయన లీలలు కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి అలానే ఈ నీబ్ కరోరి బాబా నార్త్ కి ఎక్కువ కనెక్టివిటీ ఉన్న అవధూత కావడంతో మనవారికి కాస్త కరెక్ట్ కావడం కష్టమే అయినా కూడా ఆయన లీలలు ఆయన చూపించిన ప్రేమ కరుణా వంటివి అందరినీ ఆలోచింపజేసే ఎలా ఉంటాయి.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే: శోభినవ్ సత్య నీమ్ కరోలీ బాబా పాత్రలో చూపిన పరిపక్వత ప్రశంసనీయం. ఎలాంటి లౌకిక ఆర్భాటం, కృత్రిమత్వం లేకుండా, అత్యంత నిశ్చలమైన కళ్ళతో, హుందాగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన ఆహార్యం, స్థితప్రజ్ఞత ప్రేక్షకుడికి ఒక నిజమైన యోగిని చూస్తున్న భావన కలిగిస్తాయి. చందన్ కె ఆనంద్ నాస్తికుడి నుండి దైవత్వాన్ని ఆస్వాదించే స్థితికి చేరే రామ్ నందన్ భోంస్లే పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు. ఆయన అంతర్మథనం కథాగమనానికి చక్కని బలాన్నిచ్చింది. ముఖ్యంగా స్టార్టింగ్ లో వచ్చే సీన్ అద్భుతంగా నటించాడు. విహాన్ షెడ్గే, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి తదితరులు తమ పరిధి మేరకు న్యాయం చేస్తూ కథ సహజత్వానికి తోడ్పడ్డారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే: ఈ కథను రాసుకుని డైరెక్ట్ చేసిన డాక్టర్ విశాల్ చతుర్వేది ఎలాంటి పొలిటికల్ అజెండాలు, వివాదాల జోలికి పోకుండా పూర్తిగా బాబా కరుణామయ తత్వం, మానవతా దృక్పథంపైనే దృష్టి నిలిపారు. ఎంచుకున్న కథపై ఆయన చేసిన లోతైన పరిశోధన తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సాధు తివారీ బృందం అందించిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచింది. సన్నివేశాల్లోని ఆధ్యాత్మిక గాఢతను రెట్టింపు చేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పరిమిత బడ్జెట్ అయినప్పటికీ, విశాల్ బావా కెమెరా పనితనం స్వాతంత్ర్యానికి పూర్వపు వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించింది. బ్రిటిష్ కాలం నాటి సెట్టింగులు, ప్రొడక్షన్ డిజైన్ సహజత్వానికి అద్దం పట్టాయి. శంఖ రాజ్యాధ్యక్ష ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పదును పెట్టాల్సింది. తెలుగు డబ్బింగ్ సంభాషణలు మూల భావాన్ని పాడుచేయకుండా నీట్‌గా కుదిరాయి.
ముగింపు:
‘హనుమాన్ అంశ్’ హడావుడి లేకుండా హృదయానికి హత్తుకునే ఒక నిండైన ఆధ్యాత్మిక మూవీ
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు