WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Reviews Ashokavanamlo Arjuna Kalyanam Movie Review

AVAK Review: అశోక వనంలో అర్జున కళ్యాణం

Published Date - 03:11 PM, Fri - 6 May 22
By subbarao n
AVAK Review: అశోక వనంలో అర్జున కళ్యాణం

Rating : 2 / 5

  • MAIN CAST: Vishwak Sen, Rukshar Dhillon
  • DIRECTOR: Vidyasagar Chinta
  • MUSIC: Jay Krish
  • PRODUCER: Bhogavalli Bapineedu

‘హిట్’ మూవీతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఆ తర్వాత వచ్చిన ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకులకు పిచ్చెక్కించాడు. ఇప్పుడు ఆ రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా వెడ్డింగ్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ ఎంటర్ టైనర్ లో నటించాడు. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్‌ కోలా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీని విద్యాసాగర్ చింతా డైరెక్ట్ చేశాడు. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన కొడుకు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి ఈ సినిమాను నిర్మించాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ప్రియమణి ‘భామాకలాపం’ కంటే ముందు మొదలెట్టిన ప్రాజెక్ట్ ఇది.

సూర్యాపేటలో ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే అశోక్ (విశ్వక్ సేన్) కు 33 సంవత్సరాలు వచ్చినా పెళ్ళికాదు. తమ కులంలో అమ్మాయిలు దొరక్కపోవడంతో, అతని తండ్రి గోదావరి జిల్లాలో వేరే క్యాస్ట్ లో పెళ్ళి సంబంధం చూస్తాడు. అంటే అది అరేంజ్డ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నమాట. ఈ వ్యవహారం నచ్చని బంధుగణం గొణుక్కుంటూనే వివాహ నిశ్చితార్థానికి బయలుదేరతారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ పెడుతుంది ప్రభుత్వం. నిశ్చితార్థానికి వెళ్ళిన పెళ్ళికొడుకు బంధువులు దాదాపు పదిహేనుమంది పెళ్ళికూతురి ఇంటిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఎప్పుడెప్పుడు సూర్యాపేట వెళదామా అని రోజులు లెక్కపెట్టుకుంటుంటే.. ఊహించని సంఘటన ఒకటి ఎదురవుతుంది. దాన్ని అర్జున్ ఎలా తట్టుకున్నాడు? మాధవి (రుక్సాన్ థిల్లాన)తో అతని పెళ్ళి అయ్యిందా? లేదా? అనేది మిగతా కథ.

కరోనా అనుభవాలను, అప్పటి సంఘటనలను మన రచయితలు, దర్శకులు కథలుగా తయారు చేయడం యేడాదిన్నరగా జరుగుతోంది. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే జనం ముందుకు వచ్చేశాయి. పెళ్ళివాళ్ళు లాక్ డౌన్ కారణంగా వేరే వారి ఇంటిలో ఉండిపోవాల్సి రావడం, తద్వారా ఏర్పడే సమస్యలను ఆ మధ్య సత్య నటించిన ‘వివాహ భోజనంబు’లో చూశాం. ఇందులోనూ అలాంటి సన్నివేశాలే కొన్ని రిపీట్ అయ్యాయి. అయితే దానికే పరిమితం కాకుండా వివాహానికి ముందే హీరోకు వచ్చిన సమస్య, దాని పరిష్కారం ఈ సినిమాలో చూపించారు. అంతేకాదు..  కొద్దిపాటి సందేశాన్నీ ఇచ్చారు. చిత్రం ఏమంటే.. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే, కన్విన్స్  అయ్యే సన్నివేశం ఒక్కటీ కనిపించదు. తమ కులం అమ్మాయి తమ ప్రాంతంలో దొరక్క పక్క రాష్ట్రానికి వెళ్ళినట్టు చూపించారు. పోనీ అక్కడైనా తమ కులం వారికి ఇచ్చారా అంటే కాదు.

వేరే కులం సంబంధం. మరి అదే పని ఇక్కడే చేయొచ్చు కదా! దానికి వివరణ లేదు. అలానే కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమిస్తే ససేమిరా అన్న తండ్రి, ఆ తర్వాత కులాంతర వివాహానికి అంగీకరించడం అంత సమంజసంగా లేదు. అయితే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి తమ కంటే తక్కువ కులం కాబట్టి అంగీకరించనట్టు మాటల్లో చెప్పారు. క్యాస్ట్ విషయంలో అంత పట్టింపు ఉన్న వ్యక్తి వివాహం తర్వాత ఠక్కున కూతుర్ని అక్కున చేర్చుకోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. సమాజం కోసం, బంధువుల కోసం కాకుండా తమ కోసం, తమకు నచ్చిన వారి కోసం పెళ్ళిచేసుకోవాలని, అందుకోసం ఎంతకాలమైన వేచి ఉండటంలో  తప్పు లేదని చెప్పడం బాగుంది. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పడమూ చక్కగా ఉంది. కానీ హీరో బావలో పరివర్తన తీసుకొచ్చే సన్నివేశాన్ని ఎక్కడో చోట చూపించాల్సింది. చిత్రం ఏమంటే సినిమా ప్రారంభంలో ఇటు తెలంగాణ, అటు గోదావరి యాసలను స్పష్టంగా పలికిన నటీనటులు కొంత కథ నడిచే సరికీ దాన్ని పక్కన పెట్టేశారు. బలమైన కథ లేకపోవడం, సన్నివేశాలన్నీ పేలవంగా ఉండటంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ నత్తనడకలా సాగింది. ఓ ఆడపిల్ల తప్ప వేరే ఆకట్టుకునే పాటలు లేకపోవడం మైనెస్. సంభాషణలు బాగున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ గతంలో చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు కానీ అది అతనికి సూట్ కాలేదు. తెలుగులో ఇప్పటికే మూడు సినిమాలు చేసిన రుక్సార్ ధిల్లాన్ కు ఇంకా కాలం కలిసి రాలేదు. ఇందులో ప్రధమార్థం అంతా ఆమె ఉన్నా.. ఆకట్టుకునే సన్నివేశం ఏదీ లేదు. పైగా ఆ పాత్రకు అసలు సంభాషణలే లేవు. ఇక తొలి చిత్రమే అయినా రితికా నాయక్ చక్కని నటన కనబర్చింది. కొన్ని చోట్ల ఆమె నీతిటేలర్ ను గుర్తు చేసింది. ఇతర ప్రధాన పాత్రలను కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, విద్య శివలెంక, సురభి ప్రభావతి తదితరులు పోషించారు. తమిళ హీరో అశోక్ సెల్వన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్ ఎమ్మెల్యే పాత్రలో నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ కామెడీ పండలేదు. పవి కె పవన్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధం ఎడిటింగ్, జై క్రిష్ మ్యూజిక్ ఇవేవీ చెప్పుకోదగ్గంత లేవు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సినిమాను ఎలాగోలా నిర్మాతలు బయట పడేశారనిపించింది. ఇలాంటి సినిమాలు ఓటీటీకి ఓకే గానీ థియేటర్లలో ఓపికగా చూడటం కష్టమే!

రేటింగ్ : 2 / 5

ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్ నటించడం
పేరున్న నిర్మాణ సంస్థ నిర్మించడం

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనం
బోర్ కొట్టే ద్వితీయార్థం

ట్యాగ్ లైన్: అ’శోక’ వనం!

  • Tags
  • ashokavanamlo arjuna kalyanam
  • movie review
  • tollywood movie
  • Vishwak Sen

RELATED ARTICLES

SSMB 28 : మహేష్ సినిమాలో నందమూరి హీరో..!

vishwak sen : విశ్వక్ సేన్ పారితోషికం పెంచాడా!?

Vishwak Sen: తమిళ స్టార్ డైరెక్షన్‌లో సినిమా ఫిక్స్..?

Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ లాంచ్ చేసిన ‘కరణ్ అర్జున్’ ట్రైలర్!

Vishwak Sen: కొత్త కారు కొన్న ‘పాగల్’ హీరో.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

తాజావార్తలు

  • అబ్బాయిలూ.. శృంగారంలో అమ్మాయిని రెచ్చగొట్టాలా.. ఇవి ట్రై చేయండి

  • NO Purchase Day : కేంద్రం తీరుపై పెట్రోల్ డీల‌ర్ల నిరసన

  • Revathy: తొలిసారి ఉత్తమనటిగా కేరళ స్టేట్ అవార్డ్ అందుకున్న సీనియర్ నటి!

  • Super Star Krishna: ఆ మాట అన్నానని మహేష్ స్టూడియో అంతా పరిగెత్తించాడు

  • Petrol Rates: సమస్యలు పరిష్కరించాలని మే31న నో పర్ఛేజ్ డే

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions