ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ మధ్య 2025 నవంబర్ 14-15 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ సంస్థ విశాఖపట్నం నగరం, జిల్లాలో రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడితో ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ పర్యాటక ప్రాజెక్ట్ లో సంస్థ కనీసం రూ. 150 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 2000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read:Jio Recharge Plan: జియో అద్భుతమైన 84 రోజుల ప్లాన్.. తక్కువ ధరకే మతిపోగొట్టే బెనిఫిట్స్..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులు/ అధీకృత పత్రాలు/ క్లియరెన్స్ లను సంబంధిత శాఖల నుంచి వేగంగా పొందడంలో సంస్థకు సహకరిస్తుంది. ఈ అవగాహన ఒప్పందం 3 సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ తరపున ఛైర్మన్ జస్తి శ్రీకాంత్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ లో పైన పేర్కొన్న ప్రాజెక్టుల అభివృద్ధిని నిర్ణీత కాల వ్యవధిలో సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది.