OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
- గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో వైసీపీ జీరో..
- మూడేళ్ళు దగ్గరపడుతున్నా పరిస్థితి మారలేదన్న టాక్..
- సీనియర్స్ పార్టీని వదిలిపోవడం, ఉన్నవాళ్ళని పక్కనపెట్టడం..
- పని చేయని వాళ్ళకే ప్రాధాన్యం దక్కుతోందన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా… ఫ్యాన్ పార్టీకి ఆశించిన మైలేజ్ దక్కడంలేదా..? ప్రభావం చూపలేకపోతున్నారంటూ సీనియర్లను సైడ్ చేస్తున్నా… ముఖచిత్రం మాత్రం మారడం లేదా..? లోకల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవకూడదని పార్టీ అధ్యక్షుడు జగన్ తమ నేతలకు ఇచ్చిన ఆదేశాలు అక్కడ అమలయ్యే అవకాశం కనిపించడం లేదా? ఎక్కడుందా పరిస్థితి? అసలు లోపమేంటి?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో మొత్తం తేడా తేడాగా ఉందని అంటున్నారు. పార్టీ అధినేత మా నుంచి ఏమైనా… ఎంతైనా ఆశించవచ్చుగానీ…. మేం మాత్రం ఇంతే. పైనుంచి ఏ స్థాయి భరోసా వచ్చినా… మేం చేయాలనుకున్నదే చేస్తామన్నట్టు జిల్లా లీడర్స్ ఉన్నారంటూ కేడర్‌లో అసహనం వ్యక్తమవుతోందంటున్నారు. అదే సమయంలో అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా రివర్స్ అవుతున్నాయట. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ సీట్లకుగాను 2019 ఎన్నికల్లో 13 చోట్ల విజయం సాధించిన వైసీపీ. అదే పార్టీ ఐదేళ్ళు తిరిగి 2024 ఎన్నికలకు వచ్చేసరికి అసలు అడ్రస్ లేకుండా పోయి ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఎన్నికలు ముగిసి మూడేళ్లు దగ్గరపడుతున్నా…. ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆ పార్టీ వాళ్ళే గట్టిగా చెప్పుకుంటున్నారు.
Also Read
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి అంటున్నారు స్థానిక కార్యకర్తలు. సీనియర్స్ వదిలిపోవడం.. ఉన్న నేతల్ని పార్టీ పదవుల నుంచి పీకి పక్కన పెట్టడం.. అవసరమైన చోట కాకుండా అనవసరమైన చోట్ల ప్రయోగాలు చేస్తూ ఇన్‌చార్జ్‌లను మార్చడం లాంటివి మైనస్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇవే స్థానిక ఎన్నికల్లో పెద్ద స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది జిల్లా పార్టీ వర్గాల్లో. సవాలక్ష కారణాలు చూపుతూ సీనియర్స్‌ని పక్కన పెడుతున్న అధిష్టానం.. పనిచేయని నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ… డౌన్ ఫాల్‌కు తానూ కారణం అవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
భీమవరం, ఉండి, పాలకొల్లు, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం అంటున్నారు అక్కడి నేతలు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగవ లేదని అక్కడి నేతలు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. మార్పులు చేసిన పాలకొల్లు, ఉండి, చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందట.
దీంతో సీనియర్లు సైడ్ అయినచోట కొత్తవారికి అవకాశం ఇస్తున్నా ఫలితం ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. పార్టీ ఆదేశించినప్పుడు మినహా… మిగతా సమయాల్లో సదరు నాయకులు అటు కేడర్కుగాని, ఇటు ప్రజలకుగాని ఎవ్వరికీ అందుబాటులో లేకపోవడమే ఇందుకు ఇందుకు ప్రధాన కారణం అని అంటున్నారు. జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారన్న అభిప్రాయం ఉన్నా… దాన్ని క్యాష్ చేసుకునే విషయంలో వైసిపి ఇన్‌చార్జ్‌లు పూర్తిగా వెనకబడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదంటూ అధినేత ఆశిస్తున్నా… ఉమ్మడి పశ్చిమ గోదావరిలో మాత్రం ఆ స్థాయి ఫలితం దక్కే అవకాశాలు కనిపించడం లేదని ఇక్కడి పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.కూటమి తరఫున సీనియర్ నేతలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో వైసిపి ఇన్చార్జుల ప్రభావం జీరోకి అయిందని అంటున్నారు. ధైర్యం చేసి లోకల్ ఎన్నికల్లో నిలబడదామని అనుకున్న కేడర్‌కు ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల నుంచి పెద్దగా సపోర్ట్ ఉండటం లేదన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్. గెలుస్తామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే…. ఎన్నికల్లో నిలబడిన తర్వాత అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు ఎక్కువ అవుతాయన్న భయంతో కొందరు లోకల్ లీడర్స్ పోటీకి వెనకాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
దీంతో ఏకగ్రీవాలు కాకూడదని జగన్ ఆశిస్తున్నా.. ఇక్కడ ఆ స్థాయి ఫలితం దక్కుతుందా అంటూ వైసీపీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల అవినీతిని తన నాయకులు కొందరు కనీసం ప్రశ్నించలేకపోతున్నారని, అలాంటి ఇన్‌ఛార్జ్‌ల నుంచి ఎదురెళ్ళడాన్ని ఎలా ఆశిస్తామని అంటున్నారు. దీంతో జిల్లాలో పార్టీకి బలం ఉన్నప్పటికీ నిలబెట్టే నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోందని విశ్లేషిస్తున్నారు. ఇన్‌చార్జ్‌లుగా ఉన్న చాలామంది నేతలు ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినవారే తప్ప… గెలిచిన వాళ్ళు సగమేనని అంటున్నారు.
కేడర్‌తో ఎలా మెలగాలి, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలనే విషయంలో వారికి క్లారిటీ లేకపోవడమే నియోజకవర్గాల్లో మైనస్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్ ఎన్నికల్లో వైసీపీ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ముందుండి నడిపించాల్సిన సీనియర్లు, జూనియర్లు చేతులెత్తేస్తున్న ధోరణితో వైసీపీకి డామేజ్ గట్టిగానే జరుగుతోందని సమాచారం.. ఇదే విషయాన్ని జిల్లా అధ్యక్షులుగా ఉన్న నేతలు, ఇన్ఛార్జ్లు అధినేత దృష్టికి తీసుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారట. అలా చెబితే తమ పరిస్థితి తలకిందులు అవుతుందన్నది వాళ్ళ భయంగా తెలుస్తోంది. అందుకే ఆల్‌గుడ్ అన్నట్టు కలరింగ్ ఇస్తున్నారని అంటున్నారు.ఉమ్మడి పశ్చిమలో పరిస్థితి ఇలాగే కొనసాగితే… వచ్చే ఎన్నికల నాటికి కష్టపడిన వారి కంటే అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసే వారి లిస్టే పెరుగుతందని చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?