ముఖం చాటేస్తున్న ఇంఛార్జ్..? కాంగ్రెస్ సీనియర్ల గుస్సా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. పార్టీలో సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలను తప్ప.. ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు. దీన్నే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ఈ వైఖరే ఇటీవల పెద్ద తలనొప్పికి దారి తీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొదలుకుని.. క్రమశిక్షణ కమిటీ వరకు… రచ్చ రచ్చ అయింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాజీనామాల వరకు వెళ్లిందా వ్యవహారం. ఈ అంశంపై సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారట. మాజీ మంత్రి జానారెడ్డి లాంటి వాళ్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. మరో ఇద్దరు సీనియర్లదీ అదే పరిస్థితి. చివరకు సీనియర్లంతా కలిసి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై విరుచుకుపడినట్టు తెలిసింది.
జగ్గారెడ్డి-రేవంత్ మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరినా.. ఇంఛార్జ్ ఠాగూర్ సరిగా స్పందించడం లేదనే అభిప్రాయంతో ఉన్నారట సీనియర్ నేతలు. అసంతృప్తితో ఉన్న వాళ్లను.. పార్టీ నాయకత్వం మీద కామెంట్స్చేసే వారిని పిలిచి మాట్లాడటం లేదని.. కనీసం వారి ఇళ్లకు వెళ్లి చర్చించడం లేదని గుర్రుగా ఉన్నారు సీనియర్లు. పార్టీ ఇంఛార్జ్ హోదాలు నెలలో మూడు రోజులు రాష్ట్రంలోనే ఉండి నాయకుల మధ్య సమన్వయం చేయడం.. బేధాభిప్రాయాలను పోగొట్టే ప్రయత్నం చేయకపోతే ఎలా అన్నది వారి వాదన. ప్రతినెలా మూడు రోజులు పార్టీకోసం కేటాయిస్తే తప్పేంటి? పార్టీ ఇంఛార్జ్ నేరుగా మాట్లాడితే… సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. నాయకుల మధ్య సఖ్యత కుదర్చడమే ఇంఛార్జ్ పనిగా వాళ్లు గుర్తు చేస్తున్నారట. అయితే ఠాగూర్ మాత్రం.. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు.. శ్రీనివాసన్‌లకు అప్పగించి సైలెంట్‌గా ఉంటున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి నేరుగా రావడం కంటే.. రెండు రోజుల ముందే వచ్చి నాయకులతో మాట్లాడితే బాగుంటుందనేది వారి సూచన. ఆ తర్వాతే పీఏసీలో యాక్షన్ ప్లాన్‌పై చర్చ చేస్తే పార్టీకి మంచిదన్నది కొందరి ఆలోచన.
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్‌లో హైటెన్షన్ ఎందుకు?
అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కేవలం కొందరు నాయకులు లేవనెత్తిన పంచాయితీలకే పరిమితం అవుతుందనే వాదన ఉంది. రాష్ట్రంలో సమస్యలు.. కార్యాచరణపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదని మండిపడుతున్నారు. ఇంఛార్జ్ సమయం కేటాయించక పోవడం వల్లనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనేది టాక్. ఇంఛార్జ్‌గా వచ్చిన కొత్తలో దూకుడుగా వెళ్లినా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అది కూడా చర్చగా మారింది. ఠాగూర్ వైఖరిలో వచ్చిన మార్పు కొందరికి అర్థం కావడం లేదట. మరి.. ఏం జరిగిందో.. ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయనకే తెలియాలి.
తాజావార్తలు
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!