రాష్ట్ర నేతల అనుభవం ముందు ఇంఛార్జ్ ఠాగూర్ తేలిపోతున్నారా? మాణిక్యం ఠాగూర్. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. తెలంగాణ వరకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్. రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు ఠాగూర్ గురించి ఏదేదో అనుకున్నారు. కానీ.. పార్టీ నాయకులను ఆయన గాడిలో పెట్టలేకపోతున్నారని తెలియడానికి ఎంతో టైమ్ పట్టలేదు. ఇందుకు ఠాగూర్ అనుభవ రాహిత్యం.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అనుభవం ముందు తేలిపోతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమాండింగ్ లేదు.. కంట్రోలింగ్ అంతకంటే…
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. పార్టీలో సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలను తప్ప.. ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు. దీన్నే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ఈ వైఖరే ఇటీవల పెద్ద తలనొప్పికి దారి తీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొదలుకుని.. క్రమశిక్షణ కమిటీ వరకు… రచ్చ రచ్చ అయింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాజీనామాల వరకు వెళ్లిందా వ్యవహారం. ఈ అంశంపై సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారట. మాజీ మంత్రి జానారెడ్డి లాంటి…