Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Is The Reason Behind The Silence Of Anantapur District Tdp Leaders On Madhavs Video

Gorantla Madhav : మాధవ్ వీడియోపై అనంతపురం జిల్లా టీడీపీ నేతల మౌనం వెనుక ఆంతర్యమేంటి?

Published Date :August 10, 2022 , 11:53 am
By Premchand Chowdary
Gorantla Madhav : మాధవ్ వీడియోపై అనంతపురం జిల్లా టీడీపీ నేతల మౌనం వెనుక ఆంతర్యమేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gorantla Madhav : ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీతోపాటు ఢిల్లీలో కూడా రచ్చ చేస్తుంటే.. అనంత జిల్లా నేతలు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? వైసీపీ నేతలంటే తమ పార్టీ నేత కాబట్టి సైలెంట్ గా ఉండటంలో అర్థం, పర్థం వుంది. కానీ అనంత టీడీపీ నేతలు సైతం ఎందుకు మౌనంలో మునిగి తేలుతున్నారు? సైలెన్స్ వెనక అసలు కథ వేరే వుందా?

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఇష్యూలో, టీడీపీ నేతలు వైసీపీని నేరుగా టార్గెట్ చేసి విమర్శలు దాడి చేస్తున్నారు. ఇంతా జరుగుతుంటే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే తమ పార్టీ నేత గురించి ఎందుకు మాట్లాడటం అనుకొని ఉండొచ్చు. అందునా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ టీడీపీ నేతల మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటూ కొందరు పేరాలకు పేరాలు ఆరా తియ్యడం మొదలెట్టారు..

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

టీడీపీ అధిష్టానం ఓవైపు మాధవ్ విషయాన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించలేదు. దీనికి కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. మాధవ్ కురుబ సామాజక వర్గానికి చెందిన కావడమే. ఎందుకంటే జిల్లాలో కురుబల జనాభా చాలా ఎక్కువగా ఉంది. హిందూపురం పార్లమెంట్ లో అయితే అన్ని నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎవరైనా మాధవ్ ను కించపరిచేలా మాట్లాడితే కురుబలు మాధవ్ ను ఓన్ చేసుకున్న నేపథ్యంలో, ఓట్ బ్యాంక్ కు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారధి మీడియా సమావేశం పెట్టి ఈ ఘటనపై స్పందిస్తున్నారు…విజువల్స్

టీడీపీ నేతల మౌనం వెనుక ఇంకో కోణం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. మాధవ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలపై నిఘా పెట్టినట్టు సమాచారం. వారు తరచూ బెంగళూరుతో పాటు అటు వైపు ఉన్న ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. ప్రధానంగా రిస్టార్ట్ సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఇలాంటి వాటిపై వైసీపీ నేతల నిఘా ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బళ్లారి, గౌరిబిదునూరు, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్న నేతల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఇదే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.

మొత్తం మీద మాధవ్ వ్యవహారం.. కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. ఇటు టీడీపీ నేతలకు కూడా తలనొప్పిగా మారింది. స్పందిస్తే ఒక తలనొప్పి.. స్పందించకపోతే ఇంకో తలనొప్పి అన్నట్టుగా మారింది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anantapur tdp
  • chandrababu
  • Gorantla Madhav
  • Telugu Desam Party
  • YSR Congress Party

తాజావార్తలు

  • Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్‌.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!

  • Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ

  • Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!

  • Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

  • Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions